Monday, April 29, 2024

చివరి రోజు మోకిలలో అదే ఊపు..

తప్పక చదవండి
  • మోకిల లేఅవుట్ లో నాలుగు మినహా రెండు దశల్లో
    మొత్తం 346 ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.716.39 కోట్ల రెవెన్యూ..
  • గరిష్టంగా గజం రూ. 64,000లు, కనిష్టంగా గజం రూ.49,000 లు..
  • రెండు ఫేజ్ ల్లో 350 ప్లాట్లకు గాను, 346 ప్లాట్ల అమ్మకం..

హైదరాబాద్ : మోకీలలో చివరి రోజు కూడా అమ్మకాల్లో మంచి ఊపు కనిపించింది.. రెండు దశల్లో మొత్తం 1,13,325 చదరపు గజాల స్థలం అమ్మ కాల ద్వారా రూ.716.39 కోట్ల రాబడి చేకూరింది. దీంతో సరాసరి గజం ధర రూ.63,216 లకు చేరింది.. రెవెన్యూ టార్గెట్ రూ.280.95 కోట్లు కాగా, సాధించింది రూ.716.38 కోట్ల రెవెన్యూ.. మోకిల ఫేస్-1, ఫేస్-2లో 346 ప్లాట్ల వేలంలో సరాసరి గజం ధర రూ.63,216 లు.. మోకిల హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలంలో చివరి రోజు మొత్తానికి మొత్తం 60 ప్లాట్లు మంచి రేట్లతో అమ్ముడు పోయాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో ఫేజ్-1 లో 50 ప్లాట్లు, ఫేజ్-2 లో 300 ప్లాట్లతో కలిపి 350 ప్లాట్ లకు వేలం నిర్వహించగా వాటిలో 346 ప్లాట్లు మంచిరేట్లతో అమ్ముడుపోయాయి. ముందు నుంచి హెచ్ఎండిఏ మోకిల వెంచర్ లో ప్లాట్ల కొనుగోలు కోసం ఔత్సాహికులు పోటీపడి మరీ కొనుగోలు చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్లను ఆన్ లైన్ (ఈ-ఆక్షన్)లో అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

చివరి రోజు మంగళవారం మొత్తం 60 ప్లాట్లు అమ్ముడుపోయాయి. దీంతో రెండు దశల్లో 350 ప్లాట్లకు గాను 346 ప్లాట్లు అమ్ముడుపోయి మొత్తం రూ.716.39 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఫేజ్ -2లో మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్ల రెవెన్యూ, మూడవరోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మంగళవారం నాలుగవ రోజు రూ.102.73 కోట్ల రెవెన్యూ చేకూరింది. మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండడం, ఔటర్ రింగ్ రోడ్డుకు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండడం వల్ల ఇక్కడి ప్లాట్ల కొనుగోలు కోసం ఎంతో మంది పోటీపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు