Wednesday, May 15, 2024

డీఎడ్, బీఎడ్ అభ్యర్థులపై దౌర్జన్యం గర్హనీయం..

తప్పక చదవండి
  • టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేసిన అభ్యర్థులు..
  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరెట్ ముట్టడి కార్యక్రమం..
  • పోలీసుల దౌర్జన్యాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది : కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : నిజాం కాలేజీ నుండి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ కు వెళ్తున్న అభ్యర్థులను అసెంబ్లీ వద్ద అడ్డుకొని పోలీసులు లాఠీచార్జ్ కి పాల్పడటం దుర్మార్గ చర్య. డీఎడ్. బీఎడ్ అభ్యర్థులపైన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విచక్షణారహితంగా దాడి చేయడం హేయమైన చర్య. అధికరార పార్టీకి కొమ్ముగాస్తూ.. నిరసన చేపట్టిన అభ్యర్థులను కొట్టండి, ఈడ్చేయండంటూ పోలీసులకు ఆదేశాలివ్వడం, దాడికి పురిగొల్పడాన్ని, మీడియా ప్రతినిధులపై కూడా దాడికి పాల్పడేలా ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు ఉన్నాయనడానికి, కేసీఆర్ నియంత పాలన అనడానికి జరుగుతున్న ఘటనలే సాక్ష్యాలు. ఇటీవల గ్రూప్-2 పరీక్షల నిర్వహణ వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు ధర్నా చేస్తే మహిళలని కూడా చూడకుండా పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టు చేయడం.. కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనం.

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం 13వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అడిగితే, పోలీసులతో దాడి చేయించడం దుర్మార్గ చర్య. రాష్ట్రంలో 13,500 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. తూతూమంత్రంగా కేవలం 5వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం దురదృష్టకరం. ఖాళీగా ఉన్న పోస్టులన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోస్టుల పెంపు కోసం నిరుద్యోగులు చేస్తున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ మద్దతుగా నిలుస్తుంది.

- Advertisement -

టీఎస్పీఎస్సీ అసమర్థత కారణంగా రద్దయిన గ్రూప్ -1 కు సంబంధించిన మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం నిరుద్యోగుల ఆశలపై నీళ్ల చల్లినట్లే. వెంటనే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న అన్ని రకాల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు