Saturday, May 4, 2024

నీలంను అక్కున చేర్చుకుంటున్న ప్రజానీకం..

తప్పక చదవండి
  • మా గారిబోళ్ల బిడ్డకే మా మద్దతు..
  • బిడ్డా నీవు వెనకడుగు వేయకు…
  • మేమంతా నీ వెనుక ఉండి గెలిపించుకుంటాం…
  • నీలం మధుకు భరోసా ఇస్తున్న అన్ని వర్గాల ప్రజలు…
  • మీ బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి..
  • మన అభివృద్ధి మనమే చేసుకుందాం..
  • మూడవరోజు సక్సెస్‌ఫుల్‌గా సాగిన పాదయాత్ర..

హైదరాబాద్‌ : బుధవారం మూడవ రోజు నీలం మధు ముదిరాజ్‌ పాదయాత్ర గుమ్మడిదల మండల పరిధిలోని కానుకుంట గ్రామంలో కొనసాగింది. సబ్బండ వర్గాల ప్రజల ఆత్మగౌరవ పోరాట నినాదంతో మీ ఇంటి బిడ్డ మీ కుటుంబంలో సభ్యునిగా నీలం మధు నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.గడపగడపకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ నీలం మధు ప్రజల మద్దతు కోరుతున్నారు. ముందుగా కానుకుంట గ్రామంలో టీ స్టాల్‌ వద్ద టీ తాగుతూ ప్రజలతో చిట్‌ చాట్‌ నిర్వహిస్తూ గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

పాదయాత్రలో భాగంగా కుమ్మరి సోదరుల వద్దకు వెళ్లి కుండలు చేస్తు వారి సమస్యలు కనుకున్నారు. రాజకీయ ప్రయాణంలో తాను చేసిన స్వచ్చంధ సేవ కార్యక్రమాలతో పాటు, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటాన్ని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆయా గ్రామలలో ఇంటింటికి వివరించారు.
గ్రామాలలో ఇంటింటికి వెళ్తున్న నీలం మధు ముదిరాజ్‌ ను స్థానిక ప్రజానీకం అక్కున చేర్చుకుంటున్నారు. బహిరంగంగా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఓర్చి, అంచెలంచలుగా ఎదుగుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి కష్టంలో తమకు అండగా నిలబడ్డ మా గరీబోళ్ల బిడ్డ నీలం మధు ముదిరాజ్‌కు మా మద్దతు అని స్పష్టం చేస్తున్నారు. ఆత్మ గౌరవ నినాదంతో ముందడుగు వేస్తున్న నీలం మధు ఈ ధర్మ పోరాటంలో వెనకడుగు వేయొద్దని, తామంతా దండు కట్టి నీ వెనకాల నిలబడి గెలిపించుకుంటామని భరోసా ఇస్తున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా పాదయాత్రలో నీలం మధు మాట్లాడుతూ తనను కన్నబిడ్డల ఆదరిస్తున్న మీ ప్రేమాభిమానాలు మర్చిపోలేనన్నారు. తను నమ్ముకున్న పార్టీ తనను మోసం చేసిన తాను అండగా నిలబడి సహాయం చేసిన ప్రజలు మాత్రం తన వైపు నిలబడడం గర్వంగా ఉందన్నారు. ఒక్కసారి మీ బిడ్డగా ఓటు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మన ఓటు మనమే వేసుకుంటే మన ఊరు, వాడలలో మన అభివృద్ధి మనమే చేసుకుందామని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే గుడ్‌ మార్నింగ్‌ పటాన్‌ చెరు పేరుతో ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఒక కుటుంబ సభ్యుని వలె అండగా ఉంటూ సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ఎన్‌ఎంఆర్‌ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు