Friday, May 17, 2024

విక్టరీ వెంకటేష్ లాంచ్ చేసిన ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సాంగ్..

తప్పక చదవండి

రోషన్ కనకాల తొలి చిత్రం ‘బబుల్‌గమ్‌’ రవికాంత్ పేరేపు దర్శకత్వంలో విడుదలకు సిద్ధమవుతోంది. అగ్రహీరో విక్టరీ వెంకటేష్ ‘బబుల్‌గమ్’ ఫస్ట్ సింగిల్ హబీబీ జిలేబీ సాంగ్ ని లాంచ్ చేయడంతో సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైయింది. ఈ సందర్భంగా వెంకటేష్ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీచరణ్ పాకాల మాస్, యూత్-ఆకట్టుకునే పెప్పీ ట్రాక్‌ గా కంపోజ్ చేసిన ఈ పాట లీడ్ పెయిర్ డ్యాన్స్ పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చింది. రోషన్ కనకాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకున్నారు. పాపులర్ సింగల్ రాహుల్ సిప్లిగంజ్ తన హై-పిచ్ వోకల్స్ తో అదనపు ఎనర్జీని నింపారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. ఈ పెప్పీ ట్రాక్ తెలుగు సినిమా ప్రేమికులకు మ్యూజిక్, విజువల్ ట్రీట్. మనసుని హత్తుకునే జెన్జీ ప్రేమకథతో ప్రేక్షకులను కట్టిపడేసేలా “బబుల్‌గమ్” రూపొందించారు. సరికొత్త రొమాంటిక్ జర్నీతో ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోనుంది. ప్రతిభావంతులైన తారాగణం, అద్భుతమైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్న “బబుల్‌గమ్” తప్పకుండా చూడదగ్గ చిత్రంగా ఉండబోతుంది. గరుడవేగ, తెల్లవారితే గురువరం, ఆకాశవాణి చిత్రాలకు పనిచేసిన సురేష్ రగుతు ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు