Monday, May 20, 2024

వచ్చే ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీని ఓడించాలి

తప్పక చదవండి
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
    కాగజ్ నగర్ : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి, బీఎస్పీని గెలిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అన్నారు.బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శనివారం బీఎస్పీ అధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం వాసవీ గార్డెన్ లో ముస్లీం మైనారిటీ నాయకులు శబ్బాఖాన్ అధ్వర్యంలో బీఅర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు శనివారం బీఎస్పీలో చేరారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కోనేరు కొనప్పను ఓడించి సిర్పూర్ లో కోనప్ప బ్రదర్స్ అరాచకాలు,ఆగడాలను అరికట్టాలన్నారు. బీఎస్పీపై పూర్తి భరోసాతో బీఅర్ఎస్,కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు బీఎస్పీలో చేరుతున్నారని అన్నారు. సిర్పూర్ పేపర్ మిల్ కార్మికులకు ఇచ్చే రూ.35,000 బోనస్ వడ్డీతో సహా సెప్టెంబర్ 5 లోపు చెల్లించకపోతే కార్మికులతో పెద్ద ఎత్తున సమ్మె చేస్తామని హెచ్చించారు.కేసీఆర్ ప్రభుత్వ హాయంలో ప్రతి పేద కుటుంబానికి అన్యాయం జరిగిందన్నారు. దొంగతనం కేసులో ఖదీర్ ఖాన్ అనే ముస్లీం వ్యక్తిని మెదక్ పోలీసులు అరెస్టు చేసి,విపరీతంగా కొట్టడం వలనే చనిపోయారన్నారు. హైదరాబాద్ లో ప్రజా సమస్యలపై పోరాటం చెస్తే పాత బస్తీకి చెందిన సామజిక కార్యకర్త హత్య షేక్ సయీద్ బావజీర్ ను హత్య జరుగడం దారుణమన్నారు. హత్యకు ముందే సయీద్ బావజీర్ హోం మంత్రికి మహమూద్ అలీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన ప్రభుత్వం అతని ప్రాణాలు కాపాడలేకపోయిందని విమర్శించారు.డా.అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పట్టణంలో బైక్ నడుపుతూ గల్లీ,గల్లీలో పర్యటించారు.బైక్ ర్యాలీ బస్టాండ్ నుండి మొదలై వాసవి గార్డెన్స్ వరకూ కొనసాగింది. అనంతరం పలు పార్టీలకు చెందిన నాయకులు పార్టీలో చేరారు. పార్టీలో చేరిన పలువురికి బీఎస్పీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కాగజ్ నగర్ పట్టణంలో వినయ్ గార్డెన్స్ లో కోటి చింతల చంద్రమోహన్ రావు – కల్పన దంపతుల కూతురు చందన – జగన్నాథ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ కార్యదర్శి అర్షద్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి, రాష్ట్ర మైనారిటీ కన్వెనర్ అబ్రర్ హుస్సేన్, మౌలనా షఫీ, జిల్లా మైనారిటీ నాయకుడు ముఖతీయర్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్, నియోజకవర్గ అధ్యక్షుదు రాంప్రసాద్, నవీన్, పట్టణ అధ్యక్షుడు నక్క మనోహర్,మండల అధ్యక్షుడు దొంగ్రి అరుణ్, మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి,సీతానగర్ ఎంపీటీసీ జమున మహేష్, కంబలె గౌతం, సెక్టర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, షాకీర్, శోభన్, రాజేష్, ముస్తఫీజ్, తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు