Friday, May 17, 2024

టెన్‌ డేస్‌ అమీత్‌ షా ప్లాన్‌…

తప్పక చదవండి
  • అధికారంలోకి రావాల్సిందే..!
  • గ్రూప్‌లు పక్కకు పెట్టి ఐక్యంగా పని చేయండి
  • వారి ఎత్తుగడలను పరిశీలించండి
  • పది రోజులకు ఒకసారి ఢిల్లీ నుంచి నేతల రాక
  • కోర్‌ కమిటీ సమావేశంలో అమీషా దిశా నిర్దేశం
    ఖమ్మం : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా టెన్‌ డేస్‌ ప్లాన్‌ వ్యూహాన్ని రచించారు. ఎన్నికల పూర్తయ్యేంతవరకు ఢిల్లీ నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి జాతీయ నాయకులు ఒకరు తెలంగాణకు వస్తారని అమిత్‌ షా స్పష్టం చేశారు. ఆదివారం నాడు ఖమ్మం సభ ముగిసిన అనంతరం కోర్‌ కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై జాతీయ, రాష్ట్ర నాయకులకు సూచనలు ఇవ్వడంతో పాటు కఠినమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎన్నికల ముఖ్య అంతవరకు నాయకులు ఎవరు వర్గ పోరాటాలకు పాల్పడకుండా ఏకతాటిగా ఉండి కెసిఆర్‌ పై కొట్లాడాలని ఆర్డర్‌ వేసినట్లు తెలిసింది. తెలంగాణలో ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానున్నదని తేల్చి చెప్పారు. ఆ దిశగా నాయకులు ఏ ఏ పనులు చేయాలి ఎలా ఉండాలి అనే అంశాలపై స్పష్టత ఇచ్చారు.. ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అసంతృప్తి నేతలను బీజేపీలోకి ఆహ్వానించాలని, మన పార్టీ నేతలు వేరే పార్టీలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది.. ఎన్నికల సమయంలో మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ రాజకీయ ఎత్తుగడలపై ఎప్పటికప్పుడు దృష్టి పెట్టడంతో పాటు , వాళ్ల వ్యూహాలను తిప్పుకొట్టే విధంగా అప్పటికప్పుడే ప్రణాళిక తయారు చేసుకోవాలని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టాలని ప్రజలకు వివరించడంతో పాటుగా , తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందో అనే విషయాలను లెక్కలతో సహా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తు చేశారు.. గడచిన తొమ్మిది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అక్రమాలు అవినీతి కార్యక్రమాలు ప్రతి ఒక్కటిని పోసాగుచ్చినట్లుగా ప్రజలకు తెలియజేయాలన్నారు. అదేవిధంగా బిఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న నాయకుల తప్పిదాలు, వైఫల్యాలు వంటి విషయాలపై నిరంతరం దృష్టి పెట్టాలన్నారు. టిఆర్‌ఎస్‌ నాయకుల అన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి పెడితే రానున్న ఎన్నికల్లో విజయం మనదేనని తేల్చి చెప్పారు.. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన ప్రణాళికను, అమలు చేయాల్సిన వ్యూహాలను కోర్‌ కమిటీకి వివరించారు. తాము సూచించిన ప్రణాళికను రాష్ట్రంలో అమలు చేస్తే విజయం మనదేనని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్న అనేక పరిణామాలపై అమిత్‌ షా నాయకులతో విడివిడిగా ముచ్చటించారు. జిల్లాల వారీగా జరుగుతున్న పరిణామాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి విషయాలపై పూర్తిస్థాయిలో నేతలకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్న బలమెంత… ఎన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు… ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారు… మిగిలిన స్థానాల్లో బలం పెంచుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని నేతలకు వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రం నుంచి అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నాయకు లందరూ నూతన ఉత్తేజంతో పనిచేయాలన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు