Saturday, May 4, 2024

అక్రమ కట్టడాలను సక్రమం చేస్తుంది ఎవరు?

తప్పక చదవండి

మల్కాజిగిరి : మల్కాజ్గిరి నియోజకవర్గం లోని మల్కాజ్గిరి సర్కిల్‌ పరిధిలోని దాదాపు ఆరు డివిజన్‌ లలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్న వారిని అడ్డుకునే నాధుడే కరువయ్యాడు. ప్రభుత్వ నిబంధనలను పాతర వేసే విధంగా చిన్న చిన్న ప్లాట్‌ లలో భారీ కట్టడాలను ప్రమాదకరంగా నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మల్కాజ్గిరి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిమ్మకు నీరెక్కనట్టు వ్యవహరిస్తున్నారన్నంలో ఎటువంటి సందేహం లేదు.ఇష్ట రాజ్యాంగ ఎటువంటి సెట్‌ బ్యాక్‌ లు లేకుండా అక్రమంగా పెంట్‌ హౌస్‌ లు,సెల్లార్లను నిర్మిస్తూ సక్రమంగా మార్చుకుంటున్నారు.మరి వీరికి అధికారులు అండో లేక స్థానిక ప్రజాప్రతినిధుల అండో తెలియదు గానీ రెండు అంతస్తుల పర్మిషన్లతో నాలుగు అంతస్తులు యదేచ్చగా నిర్మిస్తున్న,ఏ ఒక్క అక్రమ కట్టడంపై చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు.గౌతమ్‌ నగర్‌ 141 డివిజన్‌ పరిధిలోని గోపాల్‌ నగర్‌ కాలనీలో కంటికి కనబడేలా ఎదేచ్ఛగా అదనంగా పెంట్‌ హౌస్‌ నిర్మిస్తున్న అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.అధికారుల్లో కొంతమంది అక్రమ నిర్మాణాలకు వంత పాడుతూ, అక్రమ కట్టడాలను,ఎలా సక్రమం చేసుకోవాలో కూడా ఐడియాలు ఇస్తున్నారు అంటే వారు ఏ స్థాయిలో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారో అర్థమవుతుంది.ఇప్పటికైనా ఉన్నత అధికారులు మల్కాజ్గిరి నియోజకవర్గం పై దృష్టి సారించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను అడ్డుకోకపోతే,మల్కాజ్గిరి సర్కుల్లో పుట్టగొడుగుల రాబోయే రోజుల్లో మరెన్నో నిర్మాణాలు జరిగే అవకాశం ఉంది అని మల్కాజిగిరి పుర ప్రజలు భావిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు