Wednesday, May 15, 2024

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారు

తప్పక చదవండి
  • ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం దావోస్ వెళ్లనున్న రేవంత్
  • సీఎం వెంట వెళ్లనున్న మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్ ):- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి నెలలో స్విట్జర్లాండ్ పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. జనవరి 15-19 తేదీల మధ్య దావోస్ వేదికగా జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సీఎం వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు పలువురు ఉన్నతాధికారులు దావోస్ వెళ్లనున్నారు.ఈ సదస్సులో భాగంగా ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు చెందిన సీఈవోలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించనున్నారు. తెలంగాణ ఇప్పటికే చాలా సంస్థలు పెట్టుబడి పెట్టగా.. ఆయా సంస్థల ప్రతినిధులతోనూ తెలంగాణ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని వారిని కోరనుంది.

ప్రపంచ ఆర్థిక సదస్సులో వందకుపైగా దేశాల నుంచి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. ఈసారి ఐదు రోజులపాటు ఫ్రమ్ ల్యాబ్ టు లైఫ్ – సైన్స్ ఇన్ యాక్షన్ అంశంతో సమావేశాలు జరగనున్నాయి. మన దేశం నుంచి కేంద్ర మంత్రులతో వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు సైతం ఈ సదస్సులో పాల్గొంటారు.గత పదేళ్లలో హైదరాబాద్ నగరం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఎన్నో సంస్థలు నగరంలో కార్యాలయాలను ప్రారంభించి, భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఈ అభివృద్ధిని కొనసాగించాల్సిన బాధ్యత రేవంత్ సర్కారుపై ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు