Wednesday, May 15, 2024

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల : రాజీవ్‌ కుమార్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల జరిగింది. నవంబర్‌ 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌ కుమార్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. నవంబర్‌ 3న షెడ్యూల్‌ విడుదల చేస్తారు. అదేరోజున నామినేషన్లు ప్రారంభమవుతాయి. నామపత్రాల దాఖలుకు నవంబర్‌ 10 చివరి తేదీకాగా, నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు తేదీ. అదే నెల 13న నామినేషన్లను పరిశీంచనున్నారు. ఇక నవంబర్‌ 30న పోలింగ్‌ జరుగనుంది. డిసెంబర్‌ 3న ఓట్లను లెక్కిస్తారు. అదేరోజున ఫలితాలను ప్రకటిస్తారు. డిసెంబర్‌ 5న ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
ఎన్నికల షెడ్యూల్‌ – అక్టోబర్‌ 9
ఎన్నికల నోటిఫికేషన్‌ – నవంబర్‌ 3
నామినేషన్ల ప్రారంభం – నవంబర్‌ 3
నామినేషన్లకు చివరితేదీ – నవంబర్‌ 10
నామినేషన్ల పరిశీలన – నవంబర్‌ 13
నామినేషన్ల ఉపసంహరణ – నవంబర్‌ 15
పోలింగ్‌ – నవంబర్‌ 30
ఓట్ల లెక్కింపు – డిసెంబర్‌ 3

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు