Friday, May 17, 2024

టి.ఎస్.పీ.జె.ఏ.సి. రాష్ట్ర అధ్యక్షులు వలిగొండ నరసింహ అక్రమ అరెస్టు..

తప్పక చదవండి
  • నిరసనగా ఓయూ పోలీస్ స్టేషన్ వెళ్లిన అన్ని విద్యార్థి సంఘాల నేతలు..

హైదరాబాద్ : ఓయూలో కేటీర్ రావటానికి వ్యతిరేకిస్తూ విద్యార్థుల నిరుద్యోగుల సమస్యల పైన కనీసం స్పందన కూడా లేని ఇటువంటి చేతగాని మంత్రి ఓయూ లోకి అడుగుపెట్టే అర్హత లేదు అని, దమ్ముంటే ఆర్ట్స్ కాలేజీ రా అని టి.ఎస్.పీ. జేఏసీ ఇచ్చిన పిలుపుకు టి.ఎస్.పీ. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వలిగొండ నరసింహ ను ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అక్రమం అని టి.ఎస్.పీ. జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఇచ్చిన పిలుపు మేరకు ఓయూ లో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు, జాక్ చైర్మన్లు, టి.ఎస్.పీ. జేఏసీ చైర్మన్ గద్దల అంజిబాబు, జై భీమ్ మీడియా అధినేత సీఈఓ బరిగల శివ, బీ.ఎస్.సి. రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిగంటి వేణు గోపాల్, ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ, ఎన్.ఎస్.యూ.ఐ. ఓయూ ప్రెసిడెంట్ మెడ శ్రీను, బీ.ఎస్.ఎఫ్. ఓయూ అధ్యక్షులు పోమల అంబేద్కర్, డీబీసీఎ స్టేట్ కోఆర్డినేటర్ జంగిలి దర్శన్, ఎస్.ఎస్.యూ. స్టేట్ ప్రెసిడెంట్ నవీన్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ అజయ్, వినయ్, టి.ఎస్.పీ. జేఏసీ ఐటీ సెల్ ఇంచార్జి రవితేజతో పాటు వివిధ రాష్ట్ర విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు