Tuesday, October 15, 2024
spot_img

ఉదయనిదికి షాక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ‘సనాతన ధర్మం’ వివాదంపై దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు ఉదయనిధికి శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇటీవలే తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ ‘‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఉదయనిధితోపాటు తమిళనాడు ప్రభుత్వం, సీబీఐ, తమిళనాడు పోలీసులు సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు