Sunday, May 19, 2024

చదువు లేకపోయినా ఆరుసార్లు ఎమ్మెల్యే

తప్పక చదవండి

ముధోల్‌ : చదువుకు ప్రజాసేవకు సంబంధం లేదు. ప్రజలకు సేవ చేస్తే పదువులు వాటంతట అవే వస్తాయని నిరూపించారు ముధోల్‌ మాజీ ఎమ్మెల్యే జి.గెడ్డన్న. ఒక్క ముక్క అక్షరమైనా చదువుకోని ఆయన ముథోల్‌ నియోజకవర్గం నుంచి ఏకంగా ఆరుసార్లు ఎమ్మె ల్యేగా ఎన్నికయ్యారు. పైగా తొలిసారి పోటీ చేసినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన ఆయన్ని ఒకసారి మంత్రి పదవీ వెతుక్కుంటూ వచ్చింది. గడ్డిగారి గ్డడెన్న నిర్మల్‌ జిల్లా భైంసా మండలం దేగాంకు చెందిన వారు. ఆయన అసలు పేరు నర్సింహారెడ్డి. దాన్ని గ్డడెన్నగా మార్చుకున్నారు. గ్రామ వార్డు సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన
గ్డడెన్న… సర్పంచిగా, ముథోల్‌ పంచాయతీ సమితి ఛైర్మన్‌గా, భైంసా ఏఎంసీ అధ్యక్షుడిగా పని చేశారు. 1967లో ముథోల్‌ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవమయ్యారు. 1972, 1977, 1983, 1989, 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 1992లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, హైదరాబాద్‌ నగర ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ఆయనకు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతో సన్నిహిత సంబంధాలుండేవి. భైంసా సుద్ద వాగుపై జలాశయాన్ని నిర్మింపజేశారు. అనారోగ్యంతో బాధపడుతూనే 2004 ఏప్రిల్‌ 21న ఎన్నికల్లో ఓటేసిన నిమిషాల వ్యవధిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన సేవలకు గుర్తింపుగా అప్పటి సీఎం వైఎస్‌ భైంసా సుద్దవాగు జలాశయానికి గ్డడెన్న పేరు పెట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు