Friday, May 3, 2024

అధికారులు అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించాలి..

తప్పక చదవండి
  • విధులు నిర్వహిస్తున్న చోట దృష్టి పెట్టాలి..
  • వెనుకబడిన ప్రాంతాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు..
  • ఢిల్లీలో సంకల్ప్ సప్తాహ్ కార్యక్రమం ప్రారంభం..
  • శనివారం నుంచి వారం రోజులు జరుగనున్న ప్రోగ్రాం..

న్యూ ఢిల్లీ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయా అధికారులు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లోనే అత్యంత వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అలాగే ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకోసం ఔత్సాహికులైన అధికారులను గుర్తించాలని ఉన్నతాధికారులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ‘ ఆకాంక్ష జిల్లాల’ కార్యక్రమం అమలుపై ‘ సంకల్ప్‌ సప్తాహ్‌’ పేరిట ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే శనివారం నుంచి 7 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ సందర్భంగా మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వెనుకబడిన 100 ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. అంతేకాదు ఆ వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి తీసుకురావడం కోసం కృషి చేయాలని అభ్యర్థించారు. అయితే ఈ కార్యక్రమం అనేది కేవలం నీతి ఆయోగ్‌ కార్యక్రమంగా మిగిలిపోకూడదని అన్నారు. అలాగే ఆ 100 ప్రాంతాలు జాతీయ సగటు అభివృద్ధి సూచీని అధిగమించేలా చేసేలా కృషి చేయాలని పేర్కొన్నారు. నెల రోజుల్లో 100 వెనుకబడిన గ్రామాలను లేదా ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఇలా అభివృద్ధి చేసినట్లైతే.. రాబోయే రోజుల్లో ఆ సంఖ్యను వెయ్యికి పెంచడం పెద్ద కష్టమైన పనేం కాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అలాగే వెనకబడిన జిల్లాల్లో పోస్టింగ్‌ అంటే అధికారులు దానిని ఓ శిక్షగా భావించే వారని అన్నారు.

కానీ ఇప్పడు అలాంటి పరిస్థితుల నుంచి సరికొత్త విధానాల వల్ల వెనకబడిన ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేస్తోందో ప్రధాని మోదీ వివరణ ఇచ్చారు. యువ అధికారులు ఉద్యోగంలో చేరిన మొదటిరోజుల్లో వెనకబడిన ప్రాంతాల్లో సేవలు అందిచాల్సిందిగా ప్రభుత్వం కోరిందని, నూతనోత్సాహంతో ఆ అధికారులు పని చేయడం వల్లే ఈ మార్పునకు దారి తీసినట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. మరోవైపు ఆశించిన స్థాయిలో పని చేసినటువంటి ఉద్యోగులకు ఆ తర్వాత మంచి అసైన్‌మెంట్‌లు లభించాయని ఆయన పేర్కొన్నారు. అలాగే కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆకాంక్ష జిల్లాల విషయంలో కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సైతం అభ్యర్థించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం దీన్ని కచ్చితంగా పాటించాలని సూచనలు చేశారు. అయితే ఎవరైతే బ్లాక్‌ లెవల్‌లో అనుకున్నట్లుగా ఫలితాలు తీసుకొచ్చినవారికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు స్వతంత్ర భారత్‌లోని ఉత్తమమైనటువంటి పది పథకాల్లో ఈ ‘ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం’ ఒకటిగా ఉంటుందని ప్రధాని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు