Monday, May 6, 2024

మహా మాయలోడు మసిపూసి మారేడు కాయ చేసిన ఘనుడు

తప్పక చదవండి
  • త్రీఇంక్లైన్‌లో నకిలీ ఇంటి పన్నుల మాయాజాలం
  • ఉన్న నెంబర్లు ఇచ్చి, ఫోర్జరీ చేసి మోసం
  • అమాయకులను దగాచేసిన ఘనుడు
  • ఏటా లక్షలు దండుకుంటున్న వైనం
  • సింగరేణి క్వాటర్లకు ప్రయివేట్‌ నెంబర్లు ఇచ్చి దగా
  • నిద్రమత్తులో అధికారులు.. కలెక్టర్‌ గారు జరచూడండి

ఈ మాయలోడు మాములోడు కాదు. మసిపూసి మారేడు కాయచేయడంలో ఘనుడు. తిమ్మిని బమ్మి.. బిమ్మిని తమ్మి చేయడంతో దిట్ట. ఓపథకం రచిస్తే పని సాఫిగా చక్కబెడతాడు. అందినకాడికి దండుకుంటాడు. అధికారులకు కూడా అనుమానం రాదు. వచ్చినా ష్‌…గప్‌ చుప్‌ చేస్తాడు. ప్రయివేట్‌ ఇండ్లైనా, సింగరేణి క్వాటర్లైనా ఇంటినెంబర్‌ ఇచ్చేస్తాడు. ఆన్‌లైన్‌ ఒకరి పేరు, అయినా అదే నెంబర్‌తో మరొకరి కి బిల్లు ఇస్తాడు. మోసం చేయడం డబ్బులు దండుకోవడం వెన్నతో పెట్టిన విద్య.వెయ్యి గొడ్లు తిన్న రాబంధువు ఒక్క గాలి వానకు చచ్చింది అన్న చందంగా ఈమహా మాయ లోడు ఆదాబ్‌కు చిక్కాడు. ఆన్‌లైన్‌లో మరొకరి పేరుతో నమోదైనా అదే నెంబర్‌తో ఇంటి పన్నులు ఇచ్చి బుక్కయ్యాడు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం త్రీఇంక్లైన్‌ పంచాయతీ లో ఇంటిపన్నుల మాయాజాలానికి పాల్పడిన వ్యవహారంపై ఆదాబ్‌ ప్రత్యేక కథనం… త్రీఇంక్లైన్‌ పంచాయతీలో సింగరేణి క్వాటర్లతో పాటు ప్రయివేట్‌ ఇండ్లు సైతం ఉన్నాయి. వీటిలో ఆన్‌లైన్‌లో నమోదు అయినవి 570 ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ఇంటినెంబర్ల నమోదు ప్రక్రియను నిలిపివేసిం ది. కొత్తగా ఇల్లు కట్టుకున్న, ఇంటినెంబర్లు తీసుకోవాలన్న ఆన్‌లైన్‌ నమోదు లేకపోవడం తో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే అదునుగా భావించి త్రీఇంక్లైన్‌కు చెందిన ఓవ్యక్తి ప్రజల అవసరాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దొంగబిల్లులు ఇచ్చే ప్రక్రి యకు తెరలేపాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇతరుల పేర్లపై ఆన్‌లైన్‌లో నమోదైన నెంబర్లనే కొత్తగా కట్టుకున్న ఇంటినెంబర్లు రాని ఇళ్లకు కేటాయిస్తూ లక్షలు దండుకుంటున్నాడు. సింగరేణి క్వాటర్లకు సైతం ప్రయివేట్‌ నెంబర్ల ను ఇచ్చి పెద్దఎత్తున ముడుపులు అందుకున్న ట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి సంవత్సరం సంబంధిత అధికారులు ఇంటి పన్నులు వసూ లు చేస్తున్నప్పటికీ ఈ నకిలీ బిల్లులు తథంగా న్ని గుర్తించకపోవడంపై ప్రజలు పలు అనుమా నాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పంచా యతీలో పనిచేసిన అధికారులు కూడా ఈ దొంగ బిల్లుల వ్యవహారంలో హస్తం ఉందని వారు సైతం ఈ నకిలీ బిల్లుల వ్యవహారంలో భాగస్వాములు అయ్యారు అన్నగుసగుసలు వినిపిస్తున్నాయి.ప్రతి సంవత్సరం అనేక దొంగ బిల్లులను ఇస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకు ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు సైతం ఈ విషయాన్ని పసిగట్టకపోవడం చూస్తుంటే వారి విధి నిర్వహణ ఎలా ఉందో అర్థం చేసుకో వచ్చన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతు న్నాయి. ఆన్‌లైన్‌లో నమోదైన ఒకరి ఇంటి నెంబర్‌ను మరొకరికి కేటాయించడంతో ఆధా ర్‌, బ్యాంక్‌ అకౌంట్‌తోపాటు ఇతర నమోదు పక్రియలో ఇబ్బందులు ఎదురు కావడంతో అసలు భాగోతం బయటపడినట్లు అయ్యింది. దీంతో నకిలీ ఇంటినెంబర్లు పొందిన వ్యక్తులు లబోదిబోమంటున్నారు. ఇంటినెంబర్‌ కేటా యించేందుకు సుమారు 5నుంచి 20వేల వర కు తీసుకున్నారని ప్రతిసంవత్సరం ఇంటి పన్ను కట్టామని ఇప్పుడు మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. 6`107/1గల నెంబర్‌ అల్లకొండ కళావతి పేరుపై ఆన్‌లైన్‌ నమోదయి ఉండగా అదే నెంబర్‌ను లోది యమునా అనే మహిళ ఇంటికి సైతం కేటాయించారు.
ఇలా సుమారు వంద కు పైగానే నకిలీ ఇంటి నెంబంర్లు కేటాయించి లక్షలు దండుకుంటు న్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు