Tuesday, October 15, 2024
spot_img

రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోశయ్య

తప్పక చదవండి
  • నాదెండ్ల మనోహర్‌

అమరావతి : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర పాలనలో చెరిగిపోలేని ముద్ర వేసిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. హుందాతనం నిండిన రాజకీయాలు సాగించారన్నారు. కీలకమైన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో తన వంతు కృషి చేశారన్నారు. శాసనసభలో ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ అందరికీ సమాన గౌరవం ఇచ్చే రోశయ్య శాసనసభకే హుందాతనం తీసుకొచ్చారన్నారు. నిండుగా ఎప్పుడూ నవ్వుతూ, కొత్తవారిని ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేశారని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు