Monday, September 9, 2024
spot_img

రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషులుగా రాబర్ట్ పయస్, జయకుమార్..

తప్పక చదవండి
  • విడుదల చేయాలని హైకోర్టులో పిటిషన్‌

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పయస్‌, జయకుమార్‌ ఇద్దరు ప్రస్తుతం తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉన్నారు. వారిద్దరినీ గతేడాది పుజాల్ సెంట్రల్ జైలు నుంచి మురుగన్ తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరానికి తరలించార. ఇద్దరు హైకోర్టు మధురై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసిన ఇద్దరూ.. ప్రత్యేక శిబిరం నుంచి విడుదల చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. అలాగే ఇదే కేసులో ఎంటీ శాంతన్‌ను సైతం స్పెషల్‌ క్యాంపు నుంచి తనను విడుదల చేయాలని ఇంతకు ముందు కోరారు. ప్రత్యేక క్యాంపు గదిలోని కిటికీ సైతం మూసే ఉందని.. ఇతరులను కలిసే స్వేచ్ఛ తనకు లేదని శాంతన్‌ ముందు ఆరోపించారు. ప్రత్యేక శిబిరంతో పోలిస్తే జైలే బాగుండేదని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో రాజీవ్‌ హత్య కేసులో ఆరుగురు నిందితులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అనంతరం నిందితులను ప్రత్యేక శిబిరంలో ఉంచారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఈ కేసులో మురుగన్, నళిని, ఏజీ పెరారివాలన్, సంతన్, జయకుమార్, రాబర్ట్ పయాస్‌, పీ రవిచంద్రన్‌లతో ఏడుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికీ మరణశిక్ష విధించగా.. ఆ తర్వాత జీవితఖైదుగా మార్చారు. ఏడుగురు ఖైదీల్లో ఏజీ పెరారివాలన్‌ 2022 మేలో జైలు నుంచి విడుదలయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు