Sunday, May 19, 2024

ఏపీలో మర పథకం నిధుల విడుదల

తప్పక చదవండి
  • ఒక్కో అకౌంట్‌లో రూ.10వేలు జమ
  • జగన్ చేదోడు పథకం కింద నాలుగో విడత

ఏపీ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. జగన్ చేదోడు పథకం కింద నాలుగో విడత లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేయున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిపాడ్‌ ఏర్పాటు కోసం పట్టణంలోని వెంకటాపురం కాలనీ వద్ద స్పిన్నింగ్‌ మిల్లు సమీపంలోని మైదానాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్‌ మైదానంలో ఏర్పాటు చేయనున్న సీఎం సభా స్థలిని పరిశీలించారు. బారికేడ్ల ఏర్పాటు, వీఐపీ గ్యాలరీ, పార్కింగ్‌ తదితర అంశాలపై అధికారులకు జేసీ సూచనలిచ్చారు. జగనన్న తోడు పథకం లబ్ధిదారులను సభాస్థలికి తరలించేందుకు బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. జగనన్న చేదోడు పథకంలో భాగంగా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలలకు ప్రభుత్వం రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. గత మూడేళ్లుగా ఈ సాయం అందగా, నాలుగో ఏడాది నిధుల విడుదల చేయనున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి చేదోడు అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు జిరాక్స్, రైస్ కార్డు జిరాక్స్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ (క్యాస్ట్ సర్టిఫికెట్), దరఖాస్తు చేసుకునే వ్యక్తి బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్, షాపు తో దరఖాస్తుదారుడు దిగిన ఫోటోతో పాటుగా 21 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు ఈ పథకానికి అర్హులు. జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సచివాలయానికి వెళ్లి సంప్రదిస్తే సరిపోతుంది. పైన తెలిపిన, అవసరమైన డాక్యుమెంట్లును తీసుకెళ్లాలి. సచివాలయం సిబ్బంది పథకంలో చేరడానికి సహాయ పడతారు. ఇకపోతే గత ఏడాది స్కీమ్ కింద లబ్ధి పొందిన వారు ప్రస్తుత ఏడాది కూడా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సిందే. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శిస్తారు. అర్హత ఉండి కూడా డబ్బులు రాకపోతే ప్రభుత్వం మరో అవకాశం కూడా ఇస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు