అహ్మదాబాద్‌లో జరగనున్న వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. మొదటి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి భారత్, రెండో సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఆస్ట్రేలియా వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ రెండు జట్లు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. నవంబర్ 19న 2023 వన్డే క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతోంది. 1 లక్షా 32 వేల మంది ప్రేక్షకుల మధ్య భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేరుగా తిలకించేందుకు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే టీమిండియా అహ్మదాబాద్‌కు చేరుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని టీమ్ ఇండియా తన ఫైనల్ మ్యాచ్‌లోనూ దిగ్విజయంగా నిలవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. 2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు సోనియాతో పాటు రాహుల్ గాంధీ కూడా వస్తారని సమాచారం. అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం రూపుదిద్దుకున్న తర్వాత స్టేడియం కెపాసిటీని అమాంతం పెంచేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంను ఆవిష్కరించారు. ఈ స్టేడియంకు మొత్తం 21 ఎంట్రీ గేట్లు ఉన్నాయి. 2006లో ఈ స్టేడియంలో మార్కులు చేయడం మొదలుపెట్టారు. ఈ స్టేడియంలో మొత్తం మూడు పిచ్‌లను ఫైనల్ మ్యాచ్ కోసం తయారు చేశారు. స్టేడియంలో పిచ్ స్లోగా ఉంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాధారణంగానే క్రికెట్‌కు పెద్ద అభిమానిగా ఉన్నారు మోదీ. నాలుగోసారి భారత్ వరల్డ్‌కప్ ఫైనల్ స్టేజ్‌కు చేరింది. దీంతో మోదీ నేరుగా మ్యాచ్‌ను వీక్షించేందుకు అహ్మదాబాద్ రానున్నట్టు సమాచారం. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై కోహ్లీ, షమీలను మోదీ కొనియాడారు. చివరిసారిగా ఇండియా-ఆస్ట్రేలియా జరిగిన బోర్డర్-గవాస్కర్ నాలుగవ టెస్ట్ మ్యాచ్‌కు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటను ప్రధాని మోదీ వీక్షించారు. ఇక మళ్లీ నవంబర్ 19న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను మోదీ ప్రత్యక్షంగా తిలకించనున్నారు .