Tuesday, May 14, 2024

యూనియన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ లో పోస్టులు..

తప్పక చదవండి
  • 2023-24 బ్యాచ్ సంబంధించి 350 నావికా, యాత్రిక ఉద్యోగాలు..
  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఇండియన్ కోస్ట్ గార్డు..
  • జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచుల్లో పోస్టులు..

న్యూ ఢిల్లీ : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన యూనియన్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో.. 2023-24 బ్యాచ్‌కు సంబంధించి 350 నావిక్‌, యాత్రిక్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇండియన్‌ కోస్ట్‌ గార్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచుల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నావిక్ (డొమెస్టిక్‌ బ్యాంచ్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నావిక్‌ (జనరల్ డ్యూటీ) పోస్టులకు మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో 10+2 లేదా ఇంటర్మీడియట్‌ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. యాత్రిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/టెలీకమ్యునికేషన్‌ (రేడియో/పవర్‌) ఇంజనీరింగ్లో మూడు లేదా నాలుగేళ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా పదో తరగతితోపాటు ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణ పొంది ఉండాలి. ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/టెలీకమ్యునికేషన్‌ (రేడియో/పవర్‌) ఇంజనీరింగ్లో రెండు లేదా మూడు ఏళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు మే 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 22 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్న వారు సెప్టెంబర్‌ 22, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు సెప్టెంబర్‌ 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యింది. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.300లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు