Saturday, April 27, 2024

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి..

తప్పక చదవండి

విశాఖ నుంచి వస్తుండగా ఆయన అనారోగ్యం పాలయ్యారు.. దీంతో ఆయనను గాంధీ హాస్పిటల్ కి ఆసుపత్రికి తరలించారు.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ షూటింగ్ నుండి హైదరాబాద్ వచ్చిన రాకేష్ మాస్టర్ అప్పటి నుండి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.. కాగా ఆదివారం ఉదయం ఇంట్లో రక్తవిరోచనాలు చేసుకున్న రాకెష్ మాస్టర్ ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.. ఏఎంసీలో ఉంచి ప్రాణాలు కాపాడడం కోసం శత విధాల ప్రయత్నం చేశారు గాంధీ వైద్యులు.. కానీ వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతములో రాకేష్ మాస్టర్ మృతి చెందినట్లు గాంధీ వైద్యులు ధృవీకరించారు.. రాకేష్ మాస్టర్ మృతిపట్ల టాలీవూడ్ ప్రముఖులు, ఇతర ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.. చిత్తూరు జిల్లాకు చెందిన రాకేష్ ప్రముఖ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేశారు.. ఎంతోమంది శిష్యులను తయారు చేశారు.. ప్రస్తుత స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఆయన శిష్యుడే కావడం గమనార్హం.. పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వచ్చారు రాకేష్.. అధికార ప్రభుత్వాల మీద కూడా ఆయన ఎన్నెన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. అరెస్ట్ అయ్యి రిమాండ్ కు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు