Monday, September 9, 2024
spot_img

కొత్తకుండల బోనం..

తప్పక చదవండి
  • నగరంలో ఈ నెల 22 నుంచి బోనాలు ప్రారంభం..
  • తొలి బోనం గోల్కొండ ఎల్లమ్మ తల్లికి..
  • తుది బోనం లాల్‌దర్వాజ సింహవాహినికి..
  • ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల్ల కేటాయింపు..
  • 26 దేవాలయాలకు పట్టు వస్త్రాలు అందించనున్న ప్రభుత్వం..

హైదరాబాద్,నల్లటి మబ్బులతో ఆకాశం గర్జిస్తూ ఉంటే..ఆషాఢం వచ్చినట్టే. ఆధ్యాత్మికతకు తొలిమాసంగా భావించే ఈ ఆషాఢ మాసం హైదరాబాద్‌ నగరానికి మాత్రం మరీ ప్రత్యేకం. అనుకోని విపత్తుల నుంచి తమను కాపాడాలంటూ ఆదిశక్తి రూపాలకు బోనాలు సమర్పించి వేడుకోవడం నగరంలో 4 శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నది. వచ్చే సోమవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఈ నెల 22 (గురువారం) నుంచి జూలై 20 వరకు బోనాల ఉత్సవం హోరెత్తనున్నది. తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తారు. జూలై 16న లాల్‌దర్వాజ సింహవాహినికి తుదిబోనం సమర్పించనున్నారు. జూలై 20న గోల్కొండలో తొమ్మిదో పూజతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్లు ఇప్పటికే కేటాయించింది. బోనాల సందర్భంగా ప్రభుత్వం 26 దేవాలయాలకు పట్టువస్త్రాలు సమర్పించనుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గోల్కొండ కోట బోనాలకు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. చరిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢ మాసం ప్రారంభం రోజున నగర వ్యాప్తంగా బోనాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న లంగర్‌హౌస్‌ చౌరస్తాలో తొలిపూజతో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభంకానున్నాయి. ప్రతి యేటా ప్రభుత్వం తరఫున తొలి పూజ రోజు దేవాదాయ, హోంశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రులు హాజరై జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డుకు పట్టువస్ర్తాలను లంగర్‌హౌస్‌ చౌరస్తాలో అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారికి ఆభరణాలను అందించడం, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణతో తొలిపూజ ముగుస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు