Saturday, June 15, 2024

కేసీఆర్ దమ్ముంటే బహిరంగ చర్చకు రా..

తప్పక చదవండి
  • తెలంగాణ అభివృద్ధి, అప్పులు, హామీలపై శ్వేత పత్రం విడుదల చెయ్..
  • కాంగ్రెస్ కు 45 సీట్లు వస్తాయనడం పెద్ద జోక్..
  • డిపాజిట్లే గల్లంతైన పార్టీకి సీట్లెలా వస్తాయి?
  • కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేది కేసీఆరే..
  • 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే కేసీఆర్ డబ్బులు పంపిణీ చేస్తున్నడు
  • మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగితే హోమ్ మంత్రి ఎందుకు స్పందించలేదు?
  • మంచి పథకాలను రద్దు చేయాలనుకోవడం మూర్ఖత్వం
  • కరీంనగర్ లో పార్టీ కార్యకర్తలతో కలిసి టిఫిన్ బైఠక్ సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్

(బీజేపీ సింబల్ పై ఎవరు పోటీ చేసినా గెలిచేలా పార్టీని బలోపేతం చేస్తున్నాం.. ధరణిలోని లోపాలను కచ్చితంగా సరిదిద్ధి అందరికీ న్యాయం చేస్తాం.. : బండి సంజయ్ కుమార్)
కరీంనగర్ : తెలంగాణకు రూ.5 లక్షల కోట్ల నిధులిచ్చామని మేం లెక్కలతో సహా వివరించాం. నేను సవాల్ చేస్తున్నా… దీనిపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉంది. చర్చకు రావాలని కోరుతున్నా. అట్లాగే మీకు దమ్ముంటే తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ఎంత అప్పు చేశారు? హామీలెదుకు అమలు చేయలేదు? జీతాలెవందుకు ఇవ్వలేకపోతున్నారనే అంశాలపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్దమా?’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్ల్లో 45 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లే రాని పార్టీకి అన్ని సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేయించుకున్న సర్వేలో 45 సీట్లు వస్తాయని రాసుకోవడం కంటే… 100 సీట్లు వస్తాయని కూడా చెప్పుకోలేని స్థితిలో ఆ పార్టీ నేతలున్నారని ఎద్దేవా చేశారు. మహా జనసంపర్క్ అభియాన్ లో భాగంగా బండి సంజయ్ కుమార్ ఆదివారం రోజు కరీంనగర్ వచ్చారు. పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతో కలిసి ఉదయం ఆర్టీసీ కాలనీలోని డాక్టర్ లక్ష్మణ్ ఇంటికి వెళ్లి నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనపై రూపొందించిన పుస్తకాన్ని బహుకరించారు. మోదీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును వివరించారు.

అక్కడి నుండి లోని కరీంనగర్ రూరల్ మండలంలోని బద్దిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో బీజేపీ కార్యకర్తలతో బండి సంజయ్ ‘‘టిఫిన్ బైఠక్’’ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సహా కార్యకర్తలంతా సొంతంగా తమ తమ ఇండ్ల నుండే అల్పాహారాన్ని తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఆత్మీయంగా మాట్లాడుకుంటూ అల్పాహారం తిన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కార్యకర్తలందరినీ పేరు పేరునా పలకరిస్తూ మంచి చెడ్డలు ఆరా తీశారు. అనంతరం మహా జనసంపర్క్ అభియాన్ ఉద్దేశాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. అనంతరం సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశమై మోదీ 9 ఏళ్ల పాలనా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుతోపాటు సీనియర్ నేతలు బాస సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్ తదితరులు ఈ సమావేవంలో పాల్గొన్నారు. అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

ప్రజలకు మంచి చేస్తున్న పథకాలను రద్దు చేయాలనుకోవడం మూర్ఖత్వం. అదే సమయంలో పథకాలు మంచివైనా ప్రజలకు న్యాయం జరగకపోతో ఆ పథకంలోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అందుకే బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది అందరికీ న్యాయం చేస్తామని చెప్పినం ఎందుకంటే ధరణి కేసీఆర్ కుటుంబానికే లాభం జరుగుతోంది. దానిని సరిదిద్ది ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తాం. బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఎక్కడైనా కలిసి పనిచేశాయా? పార్లమెంట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి. రెండు పార్టీలు కలిసే పరేడ్ చేస్తున్నయ్. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. కాంగ్రెస్ నుండి గెలిచినోళ్లంతా బీఆర్ఎస్ లోకి పోతున్నరు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేసేదే కేసీఆర్. ఇప్పటికే 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు పంపిణీ చేస్తోంది కేసీఆరే. బీజేపీని దెబ్బతీసి కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని చూస్తున్నదే కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయని జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా చెప్పారు కదా… ఎవరు ? ఎవరితో పొత్తు పెట్టుకున్నారో అర్ధం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి 45 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్ కు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అవుతుందని చెప్పడం పెద్ద జోక్. డిపాజిట్లే రాని పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ కు ఎట్లా ప్రత్యామ్నాయం అవుతుంది? దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ప్రభుత్వంపై కొట్లాడితే ఆ పార్టీకి ఎందుకు డిపాజిట్లు రావు? ప్రజల తరపున కొట్లాడుతున్నదే బీజేపీ.

తెలంగాణకు రూ.5 లక్షల కోట్ల నిధులిచ్చామని మేం లెక్కలతో సహ వివరించాం. దీనిపై చర్చకు సిద్ధమా? నేను సవాల్ చేస్తున్నా… చర్చకు బీజేపీ వచ్చేందుకు సిద్ధం. మీకు దమ్ముంటే తెలంగాణ అభివ్రుద్ధి కోసం ఎన్ని నిధులు ఖర్చు చేశారు? ఎంత అప్పు చేశారు? అనే అంశంపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్దమా? నేనడుగుతున్నా కేసీఆర్ ఎందుకు ఇప్పటి వరకు పెన్షన్లు కూడా ఇవ్వలేకపోయారు? జీతాలెందుకు ఇయ్యలేకపోయారు? ఇచ్చిన హామీలెందుకు అమలు చేయడం లేదు? కేంద్ర నిధులెందుకు దారి మళ్లిస్తున్నడు? కేసీఆర్ కుటుంబం వేల కోట్లు ఎందుకు సంపాదిస్తున్నరో సమాధానం చెప్పాలి. మహిళల దుస్తులపై హోంమంత్రి మాట్లాడటం సిగ్గు చేటు. మహిళలను కించపరుస్తున్నడు. అసలు ఈ రాష్ట్రానికి హోం మంత్రి ఉన్నడా? హోంమంత్రి బాధ్యత ఏనాడైనా నిర్వర్తించాడా? హిందు మహిళల పుస్తెలతాడు తీయించినప్పుడు, బొట్టు తీయించినప్పుడు, పూలు, గాజులు, వాచీలు తీసేయించినప్పుడు హోంమంత్రి ఎటు పోయిండు? ఎవరికి హోంమంత్రి ఆయన? హిందూ మహిళలను కించపరుస్తుంటే, హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే ఎటు పోయిండు? ఇప్పుడు మహిళల దుస్తుల గురించి మాట్లాడటమంటే హిందూ మహిళలను కించపర్చడమే. యధా రాజా : తధా ప్రజా. సీఎం ఎట్లున్నడో.. ఆ పార్టీ లీడర్లు కూడా అట్లనే ఉన్నరు. వ్యక్తులపై ఆధారపడి పనిచేసే పార్టీ కాదు. పార్టీ సింబల్ పై ఎవరు పోటీ చేసినా గెలిచే విధంగా బీజేపీని బలోపేతం చేస్తున్నం. జీహెచ్ఎంసీలో గెలిచినం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. మెజారిటీ స్థానాల్లో గెలుస్తాం. కాంగ్రెస్ కు 45 స్థానాలు వస్తాయని ఆ పార్టీ చెప్పడం పెద్ద జోక్. ఆ పార్టీ సొంతంగా చేయించుకున్న సర్వే కదా… 100 స్థానాలు గెలుస్తాయని చెప్పుకుంటే సరిపోయేది అంటూ ఎద్దేవా చేశారు.. ఆ పార్టీ ఎట్లా గెలుస్తది? ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాని సంగతి మర్చిపోయారా? కర్నాటక ఫలితాల తరువాత తెలంగాణలో గ్రాఫ్ ఎట్లా పెరుగుతుందో వాళ్లకే తెలియాలి. కర్నాటకలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విదంగా పన్నులు పెంచుతుందో, మతమార్పిడిల నిషేధ బిల్లును ఏ విధంగా ఎత్తివేసిందో ప్రజలు గుర్తిస్తున్నారు. ఇదంతా కేసీఆర్ కుట్ర. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ ను లేపాలని చూస్తున్నడు. మోదీ దోస్త్ అని చెబుతున్నడు. మోదీ అంటేనే గజగజ వణుకుతున్నడు. ఆయన హైదరాబాద్ వస్తేనే రాకుండా పారిపోయిన వ్యక్తికి దోస్త్ ఎట్లా అవుతాడు? దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలని విద్యాసాగర్ రావు మాట్లాడిన వ్యాఖ్యలపై నేనేమీ మాట్లాడను. వారినే అడిగి పార్టీలో చర్చించి మాట్లాడతా. ఏది చేసినా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా, ప్రజలకు లాభం కలిగేలా నిర్ణయాలు ఉంటాయో తప్ప అందుకు భిన్నంగా బీజేపీ పనిచేయబోదు అని స్పష్టం చేశారు బండి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు