Friday, May 17, 2024

13 నియోజకవర్గాల్లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

తప్పక చదవండి

తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందే పోలింగ్‌ ముగిసింది. చెన్నూర్‌, బెల్లంపల్లి, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్‌ ఉండగా’ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ కొనసాగనుంది. అయితే, సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్‌కు అధికారులు అనుమతించారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. మిగతా నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్‌ జిల్లాలో 69.33 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్‌ నమోదైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు