Thursday, May 2, 2024

రంగు మారుతున్న తాజ్ మ‌హ‌ల్

తప్పక చదవండి

ప్ర‌పంచ‌పు ఏడు వింతల్లో ఒక‌టిగా ఉన్న తాజ్ మ‌హ‌ల్ పాల‌రాతి క‌ట్ట‌డమ‌న్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. పాల‌పుంతను గుర్తు చేసిన‌ట్టుగా తెలుపు వ‌ర్ణంలో మెరిసిపోయే ఈ షాజ‌హాన్ ప్రేమ క‌ట్ట‌డం రంగు మారుతోంది. తెలుపు వ‌ర్ణం కాస్తా ఆకుప‌చ్చ రంగులోకి మారుతుండ‌టం ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. అయితే తాజ్ మ‌హల్ హ‌రిత రూపును సంత‌రించుకోవ‌డం ఇదే మొద‌టిసారి కాక‌పోయినా న‌వంబ‌ర్ మాసంలో హ‌రిత వ‌ర్ణంలోకి మారుతుండ‌టంపై ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పురావ‌స్తు శాఖ అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తాజ్ మ‌హల్‌లోని య‌మునా న‌ది తీరం వైపున‌కు ఉన్న కొంత క‌ట్ట‌డం ఆకుప‌చ్చ‌గా మారుతోంది. ఇది 2015 నుంచి ప్ర‌తి ఏడాది జ‌రుగుతున్న ప్ర‌క్రియ‌నే. అయితే యేటా మాత్రం జూన్‌లో ఒక‌సారి ఇలా జ‌రిగాక మ‌ళ్లీ శీతాకాలం మొద‌ల‌య్యాక ఇలా అవుతుండ‌టానికి గ‌ల ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది అని ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూప‌రింటెండింగ్ ఆర్కియాలజిస్టు రాజ్ కుమార్ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు