Sunday, May 12, 2024

ప్లేస్మెంట్ డ్రైవ్..

తప్పక చదవండి

జనగామ : సెట్విన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మికశాఖ సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వ భవననిర్మాణ కార్మిక శాఖ, యువత స్వయం ఉపాధికి నైపుణ్యాభివృద్ధికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. 26 కోర్సుల్లో యాప్ ద్వారా ఉచిత ఆన్ లైన్ శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలను అందిస్తున్నారు. సెట్విన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మికశాఖ వారు ఇప్పటి వరకూ 17 జిల్లాలలో ప్లేస్మెంట్ డ్రైవ్ ని విజయవంతంగా కొనసాగించారు. శనివారం రోజు జనగామ, ఓం సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్, సిద్ధిపేట రోడ్ జనగామ, జనగామ జిల్లా తెలంగాణ నందు మొదటిసారి సెట్విన్, తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు విద్యార్థులకు ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికీ 18 కంపెనీలు ముందుకు వచ్చి సెట్విన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మికశాఖ వారి అధ్వర్యంలో ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ నుంచి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆర్ కుమార్ స్వామి పాల్గొని విద్యార్ధిని విద్యార్ధులతో సంస్థ ఉచితంగా ఇచ్చే విద్యా కోర్సులను వినియోగించుకొని మంచి భవిష్యత్తు పొందాలని విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వారి భవిష్యత్తుకు సంబంధించి సూచిస్తూ ప్రసంగించినారు.. కంపెనీ హెచ్.ఆర్స్ తో పరస్పరం చర్చించారు. ప్లేస్ మెంట్ డ్రైవ్ ల ప్రధాన లక్ష్యం లేబర్ బోర్డ్ డిపెండెంట్లకు మెరుగైన ఉపాధి వనరులను కనుగొనడం.. నిరుద్యోగ యువతకు ఉపాధి.. బోర్డు సభ్యులకు 26 సాంకేతిక కోర్సులను అందించింది. ఈ కార్యక్రమం ద్వారా సెట్విన్, తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ లేబర్ బోర్డ్ ముఖ్య లక్ష్యం రోజు కష్టం చేసుకునే కార్మికుల పిల్లలకు టెక్నికల్ ఫీల్డ్లో అవగాహన కల్పించి తక్షణమే మెరుగైన ఉపాధి కల్పించటం. ప్లేస్ మెంట్ డ్రైవ్ కి మొత్తం 245 మంది హాజరయ్యారు.. ఈ ప్లేస్ మెంట్ డ్రైవ్ కి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులకు కుమార స్వామి ప్రాజెక్టు కోఆర్డినేటర్ నాగేశ్వరావు, ప్రాజెక్టు లీడ్ సూరిబాబు పాల్గోని 127 మందికీ ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు