Monday, April 29, 2024

పహాడి దర్గా రాంప్ రోడ్డు నిర్మాణానికి రెండు దశల్లోరూ. 14 కోట్ల 25 లక్షలు మంజూరు

తప్పక చదవండి

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి ధన్యవాదాలు తెల్పిన జల్ పల్లి మునిసిపాలిటీ మైనార్టీలు, దర్గా కమిటీ ప్రతినిధులు.

హైదరాబాద్ : పహాడి షరీఫ్ లోని ప్రసిద్ద హజ్రత్ బాబా షర్ఫోద్దీన్డ్ రహమతుల్లా దర్గా కు సీసీ రాంప్ రోడ్డు నిర్మాణానికి అదనంగా 4 కోట్ల 65 లక్షల రూపాయలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంజూరు చేయించారు. ఇప్పటికే రూ. 9 కోట్ల 60 లక్షలు మంజూరు చేయించగా, పనులు అసంపూర్తిగా ఉండటంతో దర్గా గుట్టపైకి వాహనాలు వెళ్ళటానికి వీలుగా మంత్రి అదనంగా నిధులు మంజూరు చేయించారు. దాంతో మొత్తం రూ. 14 కోట్ల 25 లక్షల రూపాయల నిధులు దర్గా రోడ్డు, గుట్టపై పార్కింగ్ తదితర సౌకర్యాల కల్పనకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దర్గా అభివృద్ధికి రూ. 14 కోట్ల 25 లక్షల రూపాయలు విడుదల చేయించిన మంత్రికి జల్ పల్లి మునిసిపాలిటీ మైనారిటీలు,దర్గా కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు