Saturday, May 4, 2024

దేవరకద్ర కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కై కదిలిన కాంగ్రెస్ శ్రేణులు

తప్పక చదవండి

దేవరకద్ర : దేవరకద్ర నియోజకవర్గంలో జి.ఎం.ఆర్, మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ పై కాంగ్రెస్ శ్రేణులు, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గ్రామపంచాయతీ, నాయకులు, వార్డ్ మెంబర్లు, సామాన్యులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పేదలు అధిక సంఖ్యలో ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతన ఉత్సాహంతో వీరంతా పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. కాంగ్రెస్ ఈ సారి విజయ పదంలో ముందు కొనసాగి, తమ నాయకుని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జి మధుసూదన్ రెడ్డి సొంత గ్రామమైన దమగ్న పూర్ నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా భారీగా దేవరకద్ర లకు చేరుకున్నారు. స్థానిక ఎమ్మార్వో కు తమ నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం భారీ గజమాలతో అయనను సత్కరించారు. ఈ నామినేషన్ లో భాగంగా సీతా దయాకర్ మద్దతు పలికారు. వీరితో పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వార్డు నెంబర్ మై మధు తిరుపతయ్య, వెంకటేష్, శ్రీనివాసులు గౌడ్, మెడికల్ షాప్ వెంకటేష్, ప్రతాపు దినకరన్, అబ్బురము రాజులు, మహమూద్ వీరితో పాటు భారీ బైక్ ర్యాలీతో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు