Tuesday, April 30, 2024

జనసంద్రముగా మారిన పాలమూరు

తప్పక చదవండి
  • ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అశేష ప్రజానీకం తరలి రాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వెంట నడవగా, రోడ్డు పొడవునా యువత బైక్ లతో ర్యాలీ చేయగా , ప్రచార రథం పైనుంచి పట్టణ ప్రజలకు చిరు దరహాసంతో అభివాదం చేస్తూ, తెలంగాణ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆశేష ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.. విజయ శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఎన్నికలు ఇవి, నమ్మించి మోసం చేయడమే వారి పని, ఆ బాధ ఎలా ఉంటుందో భరించిన వాడికి తెలుస్తుంది. ఇక భయం గుప్పెట్లో బ్రతకాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు సంపూర్ణంగా మద్దతు గా నిలుస్తుందని నేను హామీ ఇస్తున్నాను అని అన్నారు. ఇన్నాళ్లు పాలమూరు ప్రజలు భయం గుప్పెట్లో బ్రతికింది ఇక చాలు. చీకట్లో ఇన్నాళ్లు మగ్గిపోతున్న మీ బ్రతుకులలో వెలుగు నింపాల్సిన సమయం ఆసన్నమైంది, అందుకే నేను నా అక్క చెల్లెళ్ల లను అన్న తమ్ముళ్ళ ను, యువతను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ కి మీరందరూ సహకరించి ఓటు వేయండి.

ఆత్మగౌరవ నినాదం తో తెచ్చుకున్న తెలంగాణ నేడు ఆత్మ వంచనకు గురి అవుతుంది. ఎన్నో సంవత్సరాలు ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమేనా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి లేదు మరి దేని కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అని ఆయన ప్రశ్నించారు. మార్పు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీని మనం తప్పకుండా కాపాడుకొని, ఈ నెల 30 నా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ అధికంగా మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. బీసీ సంక్షేమ అంటూ విద్యకు దూరం చేయాలని జిమ్మిక్కులు చేస్తూ 3000 పాఠశాల లను మూసివేసిన ఘనతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అభివృద్ధి, మన పిల్లలు చదువు కొంటే, ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని గొర్రెల పెంపకం బర్రెలు పెంపకం చేపలు పంపకం చేపిస్తూ ఇది అభివృద్ధి అంటున్నారు. అసలు అభివృద్ధి అంటే ఏమిటో ఇక్కడి నాయకులను అడుగుతున్నా. బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక వైపు, అన్ని వర్గాల ప్రజలను మోసం, దగా చేసిన పార్టీ ఒక వైపు, భూ ఆక్రమణలు, భూ దందాలు, కుల్లు కుతంత్రాలు చేసే ఇద్దరు వ్యక్తులు ఒక వైపు స్వచ్చమైన పాల నురుగు వంటి పాలమూరు నియోజకవర్గం ప్రజలు ఒక వైపు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకొనే బాధ్యత నాదే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అనవసరమైన కేసులు ఉండవు, ఎవరి వ్యక్తిగత విషయాలలో నేను జోక్యం చేసుకోను, విముక్తి కోసం గతంలో రెండు సార్లు స్వాతంత్ర్య పోరాటం చేసాం మొదటి సారి దేశం కోసం, రెండో సారి రాష్ట్రం కోసం ఇప్పుడు మూడో సారి మన మహబూబ్ నగర్ కోసం ఒక్కటై కదిలి రండి మహబూబ్ నగర్ కి విముక్తి కోసం మీ ఓటు ద్వారా మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కండి అని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధి మీద మహబూబ్ నగర్ అంతా అరాచకమే జరిగింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంత, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు బెక్కరి అనిత, మహబూబ్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాధ అమర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ పి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు యం.సురేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ లింగం నాయక్, మదీనా మజీద్ కౌన్సిలర్ మోయిన్ అలి, కాంగ్రెస్ నాయకులు అమర్, కాంగ్రెస్ నాయకులు రాఘవేంద్ర రాజు, ఐఎన్ టియుసి రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లు నర్సింహరెడ్డి, హన్వాడ మండల అధ్యక్షుడు టంకర కృష్ణయ్య యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు ఆజ్మత్ అలీ, తాహెర్, శివశంకర్, మక్సూద్, తులసి రాం నాయక్, కిషన్ నాయక్, రాజు, ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు