Wednesday, September 11, 2024
spot_img

రేవంత్‌ ఇంటికి నీలం మధు

తప్పక చదవండి
  • పూల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నీలం మధు
  • గాంధీభవన్‌ లో ఎఐసిసి పెద్దలతో భేటీ
  • ఏఐసిసి పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన నీలం
  • మధు సమక్షంలో పార్టీలో చేరిన ముఖ్య నాయకులు..
  • పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి పని చేస్తాం: సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు

హైదరాబాద్ : టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జన్మదిన సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి పూల బొకే ఇచ్చి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పటాన్చెరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌. మా ఆత్మగౌరవ పోరాటానికి అండగా నిలబడి ముదిరాజ్‌ సామాజిక వర్గానికి నాలుగు టికెట్లు కేటాయించిన కాంగ్రెస్‌ పార్టీకి యావత్‌ తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు రుణపడి ఉంటారన్నారు. నన్ను నమ్మి ఆదరించి అక్కున చేర్చుకొని పటాన్‌ చెరు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన పైనున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులను, శ్రేణులతో కలిసి పని చేస్తూ ఐక్యమత్యంతో పటాన్చెరు లో కాంగ్రెస్‌ ను గెలిపిస్తామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాకు పటాన్చెరు సీటును గెలిచి గిఫ్ట్‌ గా ఇస్తామని తేల్చి చెప్పారు.


అనంతరం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి గాంధీభవన్‌కు చేరుకున్నారు. తొలిసారి గాంధీభవన్‌ కు చేరుకున్న నీలం మధు ముదిరాజ్‌ ఏఐసిసి పెద్దలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు ఏఐసీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పటాన్‌ చెరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎఐసిసి పెద్దలతో పాటు పటాన్‌ చెరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఐఎన్‌ టియుసి జిల్లా అధ్యక్షుడు, పటాన్‌ చెరు కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ పార్టీ సైనికులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామని తెలిపారు. పటాన్‌ చెరు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ని తమ భుజాలపై పెట్టుకుని గెలిపిస్తామన్నారు. అధినాయకత్వం ఆదేశాలను శిరసావహిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసి పటాన్చెరు గడ్డపై కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగిరే విధంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట తెల్లాపూర్‌ కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి, పెద్దకంజర్ల మాజీ సర్పంచ్‌ సంజీవరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ పటాన్‌చెరు పట్టణ ఉపాధ్యక్షుడు శేఖర్‌, అమీన్‌పూర్‌ కౌన్సిలర్‌ కొల్లూరు మల్లేష్‌, సీనియర్‌ నాయకులు అన్వర్‌ పటేల్‌, అబ్దుల్‌ ఖాదర్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు