Tuesday, May 7, 2024

ఉద్యమాలు మరిచిన కమ్యూనిస్ట్‌లు

తప్పక చదవండి

నిజమే అనిపిస్తుంది, అవును కమ్యూనిస్ట్‌లు ఈ మధ్య కాలంలో పోరాటాలు చేస్తున్నారా! అని ఒక పెద్దాయన ఒక అబ్బాయితో చర్చిస్తున్నాడు, అయితే తెలంగాణలో కమ్యూనిస్ట్‌లు సీపీఐ మరియు సీపీఎంలు చెరో పంథాలో వెళ్తున్నారు, ఈ సారి సార్వ త్రిక ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్స్‌ తో పొత్తు కుదుర్చుకుంది, సీపీఎం ఏ పొత్తు లేకుండా ఒంటరిగానే పోరాటం చేసింది, అయిన వాళ్ళకు లభించిన ఓట్లు ఇండిపెండెంట్‌ అభ్యర్థికి వచ్చిన అంతా ఓట్లు రాలేకపోయాయి, మరీ ఇంతలాఅవడానికి కారణం ఎవరు? పోరాటాలు లేవు: అయితే ముఖ్యంగా కమ్యూనిస్ట్‌ లు ఎన్నొ పోరాటాలు చేశారు, తెలంగాణ సాయుధ పోరాటానికి నాయ కత్వం వహించారు, నైజాం నవాబు కు ఎదురు తిరిగి గెరిల్లా పోరాటాలు చేశారు, చరిత్రా అంతా బానే ఉంది, మరీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం లేకుండా వెళ్తుంది, గత చాలా రోజుల నుండి పోరాటాలు మరిచింది, ఎంత సేపు పొత్తులతో వెళ్ళటం వల్ల, ఎవరికి లాభం, ప్రజల్లో పార్టీ నిర్మాణం ఎలా జరుగుతుంది, ఏదో కొద్దో గొప్ప కొన్ని స్థానాల్లో డిపాజిట్లు అయిన దక్కాయి, వచ్చేసరికి అయితే అవి కూడా కష్టమే అనిపి స్తుంది. రోజూ నిత్యావసర ధరలు చుక్కలు చూస్తున్నాయి, వంట నూనెలు, గ్యాస్‌ ధరలు, రైస్‌, ఆకాశాన్ని తాకే స్థాయిలో ఉన్నాయి, రాష్ట్రం అంతా బాగున్ననట్టు కమ్యూనిస్ట్‌లు నిద్ర పోతున్నారు, కొత్త వారికి సైతం నాయకత్వం ఇవ్వక పోవటం, కూడా కొంత మేర పార్టీకి నష్టంగా చెప్పవచ్చు. ఉమ్మడిగా వెళ్ళాలి: అటు సీపీఐ సీపీఎం కల వాలి, సిద్ధాంతం అంతా ఒకటే, ఎప్పుడో 1964 విడిపోయి నేటికీ చెరో దారి ఎంచుకున్నారు, ఇప్పటి వరకూ అధికారం సాధించలేక పోయారు, మరీ ఎందుకీ దూరం, ఇద్దరి ఆశయం ఒక్కటే, మరీ దాని కోసం కలిస్తే నష్టమేమీ ఉండదన్న భావన ఉండాలి, మరీ వేరే బూర్జువావర్గంతో పొత్తు అంటే కుషిగా వెళ్తున్నారు తప్ప ఆశ యం, సిద్దాంతాలు అన్ని ఎక్కడో వేశారు అనిపిస్తుంది. రానున్న రోజుల్లో రెండూ పార్టీలు ఏకంఅయ్యి ఒకేపంథాలో వెళ్తే బాగుం దొచు అని చెప్ప వచ్చు. బూర్జువ పార్టీ లతో పొత్తు: అయితే కమ్యు నిస్ట్‌లు ఎందుకు బిన్నంగా అలోచన చేస్తు న్నారు, ఏదైనా అంటే మన బలం నిరూపించుకోవ డానికి సరైన బలం లేనప్పుడు, ఏదో ఒక పార్టీతో పొత్తు అవసరం అని వాపోతు న్నారు, మరీ అధికా రం దిశగా ఎప్పుడు వెళ్తారు, ఇలాఅయితే చాలాకష్టమే అనిపిస్తుం ది, పొత్తులతో కొన్ని సిట్లు వస్తాయి ఎమో కాని ప్రజల్లో మాత్రం విశ్వాసం నమ్మకం పోతుంది అనీ చెప్పవచ్చు,కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైతం రెండుపార్టీలు కలిసి కార్యాచరణ ప్రణా ళిక సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుందాం, కమ్యునిస్ట్‌ లా పోరాటాల చరిత్ర మళ్లీ ప్రజల్లోకి వెళ్ళాలి, పూర్వ వైభవం తేవాలి!
` కిరణ్‌ ఫిషర్‌ అడ్వకేట్‌ 9133661793

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు