- పేషంట్స్ వార్డులో పర్యటించి, రోగులతో మాటా మంతి..
- దవాఖానలో చికిత్స కోసం వస్తున్న రోగుల హాజరు పట్టిక పరిశీలన..
జనగామ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టి. హబ్ ద్వారా చాలా రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిధులు కేటాయించి, వైద్యరంగాన్ని ఎంతో అభివృద్ది చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రానున్న స్వల్ప కాలంలో జీ.ఎం.ఆర్.ఎం. ట్రస్టు ద్వార చిట్యాల సి.హెచ్సీ. లో రోగులకు ఉచితంగా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనితున్నమని తెలిపారు.. ఇటీవల కాలంలో అకాల వాతావరణ మార్పులతో ప్రబలుతున్న జ్వరం కారణంగా ప్రజల ఎవరు ఇబ్బందులు పడుతున్నారనీ దవాఖానలో పర్యటన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టి నాయకులు, వైద్యులు ఉన్నారు.