Friday, May 17, 2024

రాజ్యసభ ముందుకు మహిళా బిల్లు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్‌ అధినియం’ బిల్లు గురువారం ఉదయం రాజ్యసభ ముందుకు చేరింది. సభ ప్రారంభంకాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ మహిళా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో చర్చ చేపట్టారు. చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్‌ నిర్వహిస్తారు. అయితే, ఈ బిల్లుకు విపక్ష సభ్యులు మద్దతు తెలుపుతుండటంతో ఎగువ సభలో బిల్లు ఆమోదం పొందడం లాంఛనంగా కనిపిస్తోంది. ఉభయ సభల ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడిరచింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు