Sunday, May 19, 2024

తెలంగాణలో అవినీతి టెండర్‌ భాగోతం..

తప్పక చదవండి
  • కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం?
  • నిబంధనల బేఖాతర్‌…
  • పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం..

హైదరాబాద్‌ : తెలంగాణలో మరో అవినీతి టెండర్‌ భాగోతం వెలుగుచూసింది. ప్రజల దగ్గర నుండి ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యాన్ని తక్కువ ధరకే తమ అనుయాయులకు కట్టపెట్టి సుమారు 1500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి భారీ స్కెచ్‌ వేసినట్టు కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండిరచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం క్వింటాల్‌ కు 2040-2060 రూపాయల మద్దతు ధరతో సుమారు 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1930 రైస్‌ మిల్లులలో భద్రపరచింది. అయితే ఈ ధాన్యాన్ని అమ్మకానికి ప్రభుత్వం మొదటి దశలో మొత్తం 25 లాట్లుగా విభజించి 25 గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియలోనే తమ వారికి అనుకూలంగా ఉండే విధంగా నిబంధనలు రూపొందించిన ప్రభుత్వ పెద్దలు, రైస్‌ మిల్లర్లు స్థానికులు ఎవరూ టెండర్లలో పాల్గొనకుండా నివారించింది. ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించగా కేవలం ఒకే సంస్థ సింగల్‌ టెండర్‌ దాఖలు చేయడం గమనార్హం…అది కూడ ప్రభుత్వం సేకరించిన క్వింటాల్‌ ధర 2203 రూపాయలు అయితే, టెండర్‌ దాఖలు చేసిన సంస్థ కోట్‌ చేసిన ధర కేవలం 17 వందల రూపాయలే..అంటే క్వింటాలు 500 రూపాయల వ్యత్యాసం ఉండగా హమాలీ, ట్రాన్స్పోర్ట్‌ తదితర ఖర్చులు కలుపుకుంటే 700-800 రూపాయలు ప్రజాధనాన్ని దర్వినియోగపరిచి ప్రవేట్‌ సంస్థలకు అప్పనంగా కట్టబెడుతుంది. ప్రభుత్వం 25 టెండర్లు పిలవగా 15 టెండర్లకు 54 మంది పోటిపడగా మరో 10 టెండర్లకు కేవలం ఒకే సంస్థ టెండర్‌ దాఖలు చేసి ప్రభుత్వ నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు కోట్‌ చేసినప్పుడు వాటిని రద్దు చేయాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడ్డారో లేక అమాత్యుల మెప్పుకోసమో కానీ, సంబంధిత ఉన్నతధికారుల వద్దకు అప్రూవల్‌ కోసం ఫైలు పంపించినట్టు తెలిసింది. ఇప్పటికైన ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఆర్థిక శాఖ, సివిల్‌ సప్లయ్‌ అధికారులతో మాట్లాడి టెండర్లను రద్దు చేయకపోతే పలువురు కాంట్రాక్టర్లు కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు