Monday, May 6, 2024

తెలుగుదేశం పార్టీకి పెరుగుతున్న గ్రాఫ్‌..

తప్పక చదవండి
  • తెలంగాణలో పుంజుకుంటున్న తెలుగుదేశం..
  • చంద్రబాబు అరెస్టు నిరసిస్తున్న తెలంగాణ ప్రజలు..
  • రాజకీయంగా కలిసివచ్చే అంశంగా చెబుతున్న విశ్లేషకులు..
  • తెలంగాణాలో టీడీపీ సానుభూతిపరులున్నారన్నది వాస్తవం..
  • టీడీపీ బలపడడంతో ఏపార్టీకి లాభం..? ఏపార్టీకి నష్టం..?
  • ఇప్పటికే అంచనాలు మొదలుపెట్టిన రాజకీయ విశ్లేషకులు..

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టిడిపికి మరింత ప్రజాదరణ పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో క్రమంగా సానుభూతి పెరుగుతోంది. చంద్రబాబుకు మద్దతుగా తెలుగు రాష్టాల్ల్రోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా నిరసనలు చేపడుతున్నారు. రాజకీయంగా ఇది బాగా కలసి వచ్చే అంశంగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో సానుభూతిపరులు ఇప్పటికీ ఉన్నారు. వీరంతా రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. చంద్రబాబు ఎంత దార్శనికతతో ఉంటారో ఎలా కష్టపడతారో ఆ పోస్టులో వివరించారు. హైదరాబాద్‌ ఐటీ అభివృద్ధి చెందుతున్న సమయంలో ఓ ఆఫీసును హైదరాబాద్‌లో ప్రారంభింపచేయడానికి చంద్రబాబు ఎలా కష్టపడ్డారో పేర్కొన్నారు. ఇలాంటి నేతలు దేశానికి ఎంతో అవసరమన్నారు. అటు చంద్రబాబుతో నేరుగా పరిచయడం ఉన్న పలువురు పారిశ్రామికవేత్తలు టీడీపీ అధినేత పనితీరును సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. చంద్రబాబును అక్రమ అరెస్ట్‌ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వీరి స్పందన ద్వారా తెలుస్తోందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేతకు సంఫీుభావం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. విదేశాల్లో పని చేస్తున్న తెలుగు ప్రజల్లో చాలా మంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే.. చంద్రబాబు ఐటీ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లోని ఎన్నారై టీడీపీ శాఖల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏపీ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్, కనెక్టికట్‌, వాషింగ్టన్‌ డీసీతో పాటు బెల్జియం, ఆస్ట్రేలియా, మలేషియా, దక్షిణాఫ్రికా, టాంజానియా దేశాల్లోని టీడీపీ ఎన్నారై శాఖల సభ్యులు, అభిమానులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు.. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రజల్లోకి వెళ్తున్న మాజీ సీఎం చంద్రబాబుకు వస్తున్న మద్దతును చూసి సీఎం జగన్‌ బెంబేలెత్తిపోతున్నారని విమర్శలు వస్తున్నాయి. అందుకే ఆయన్ను కుట్రపూరితంగా అరెస్టు చేశారని విమర్శించారు. దుబాయ్‌లో కూడా ఎన్నారైలు చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కారు. టీడీపీ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో పార్టీ అధినేతకు మద్దతుగా నిరసన దీక్ష నిర్వహించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు