Saturday, May 18, 2024

కొనసాగుతున్న బిఆర్‌ఎస్‌లోకి వలసలు

తప్పక చదవండి
  • మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు

సూర్యాపేట : ఎన్నికల పోలింగ్‌ సవిూపిస్తున్న తరుణంలో సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల జాతర కొనసాగుతుంది. పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధికి మద్దతు తెలుపుతూ, స్వలాభం కోసం చేస్తున్న నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ , బీఎస్పీలను వీడి ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా గాంధీనగర్‌ ఎస్సీ కాలనీకి చెందిన శ్రీకాంత్‌, రుత్విక్‌ యాకోబు, విజయ్‌ మధు అనిల్‌ తో పాటు పెద్ద సంఖ్యలో అంబేద్కర్‌ యూత్‌ సభ్యులు మంత్రి జగదీశ్‌ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. మరోవైపు కాంగ్రెస్‌ నాయకులు అనంతల శ్రీనివాస్‌ గౌడ్‌ ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 31 వ వార్డు నుంచి కాంగ్రెస్‌ యూత్‌ అధ్యక్షుడు రాపర్తి నాగరాజుతో పాటు 83 మంది యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధికి ఆకర్శితులై, తనకు మద్దతుగా పార్టీలో వారికి వచ్చిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. సూర్యాపేటను దేశంలోనే నెంబర్‌ వన్‌గ తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, జరుగుతున్న అభివృద్ధి యజ్ఞంలో పార్టీలకతీతంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ దిలీప్‌ రెడ్డి, రఫీ, జనార్దన్‌, అనంతల దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు