Monday, May 20, 2024

మేడిగడ్డ కుంగింది… కేసీఆర్ పాపం పండింది

తప్పక చదవండి
  • కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది
  • రీడిజైన్ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు
  • నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
  • ఇంత జరిగినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం పై నోరు మెదపలేదు
  • కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలి
  • టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి

కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలి అయిపోయిందనీ, అయన ఓ ఆర్థిక ఉగ్రవాది అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. డిజైన్ అనుకున్నది ఒకటైతే.. నిర్మించింది మరొకటైందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టిందన్న రేవంత్ రెడ్డి.. అవినీతి బట్టబయలైందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అని సీఎం కేసీఆర్ అన్నారనీ, రక్తం ధారపోసి కట్టానని అన్నారనీ.. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలనీ, వెంటనే అరెస్ట్ చెయ్యాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లు కాగా.. దాన్ని లక్షా 51 వేల కోట్లకు పెంచారనీ.. ఇప్పటికీ 50 శాతానికి పైగా పనులు పూర్తి కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ అవినీతికి కేంద్రం సహకరించిందన్న ఆయన.. మేడిగడ్డ కూలిపోగానే.. తప్పును సాంకేతిక నిపుణులపైకి తోసేసే కుట్ర జరుగుతోంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది అన్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణకు చెందని అధికారులతో ఓ కమిటీని వేసి.. ఆ కమిటీతో కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్నీ పరిశీలించి నివేదిక ఇవ్వాలనీ, దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. అలాగే… 2014-2023 వరకూ కాళేశ్వరం వెనక మంత్రి హరీష్ రావు, సీఎం కేసీఆర్‌ ఉన్నారన్న ఆయన.. వారిద్దర్నీ వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు