Sunday, May 19, 2024

లాస్య నందితను గెలిపించి.. కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం

తప్పక చదవండి
  • మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

కంటోన్మెంట్‌ : కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను భారీ మెజార్టీతో గెలిపించుకుని, కంటోన్మెంట్‌ సీటును సీఎం కేసీఆర్‌ కు కానుకగా ఇవ్వాలని కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇంఛార్జ్‌,మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు.సికింద్రాబాద్‌ లీప్యాలెస్‌ లో ఏర్పాటు చేసిన కంటోన్మెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా దివంగత ఎమ్మెల్యే సాయన్న చిత్రపటం వద్ద ఆయన పుప్పాంజలి ఘటించారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ బీ ఆర్‌ ఎస్‌ పార్టీ మేనిఫెస్టోను చూసి ప్రతిపక్ష పార్టీల మైండ్‌ బ్లాక్‌ అయిపోయిందని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్యాస్‌ సిలెండర్‌ ధరను 1200 రూపాయలకు పెంచితే 400 రూపాయలకే ప్రభుత్వం ఇస్తుందని మేనిఫెస్టో ద్వారా సీఎం కేసీఆర్‌ వెల్లడిరచారని చెప్పారు.అదేవిధంగా రేషన్‌ ద్వారా సన్నబియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని అన్నారు. గతంలో కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందిన హేమా హేమీలు చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ సహకారంతో సాయన్న చేశారని తెలిపారు.గతంలో కంటోన్మెంట్‌ నియోజకవర్గ ప్రజలకు 15 రోజులకు ఒకసారి త్రాగునీరు సరఫరా జరిగేదని, దివంగత ఎమ్మెల్యే సాయన్న చొరవతో జిహెచ్‌ఎంసి లో మాదిరిగా నీటి సరఫరా జరిగేలా మంత్రి కేటీఆర్‌ చేశారని చెప్పారు. ఆర్హ్రులైన అనేకమందికి కళ్యాణ లక్ష్మి, శాదీముబారాక్‌, పెన్షన్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను అందించేందుకు సాయన్న ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. తెలిపారు.అంతకుముందు కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లాస్యనందిత మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో బీఆర్‌ఎస్‌ బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్‌ కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆశీర్వాదంతో కంటోన్మెంట్‌ నియోజకవర్గ అభివ్రుద్ధికి క్రుషి చేస్తానని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే సాయన్నలాగే అభివ్రుద్దే ఏకైక ముందుకు సాగుతానన్నారు. గులాబీ శ్రేణులంతా తనను సొంత కుటుంబసభ్యురాలిగా భావించి, తన విజయానికి సహకరించాలన్నారు. గత ఎన్నికల్లో లాగే ఈసారి కూడా గులాబీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని లాస్యనందిత విన్నవించారు. ఈ సమావేశంలో బెవరేజేస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నగేష్‌, మాజీ కార్పొరేటర్‌ ఆకుల రూప హరి, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు మహేశ్వర్‌ రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు అనితా ప్రభాకర్‌, నళిని కిరణ్‌, పాండు యాదవ్‌, భాగ్యశ్రీ శ్యాంకుమార్‌, లోకనాథంతో పాటు పలు వార్డుల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, ఆలయ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, బీఆర్‌ఎస్‌ కు సంబంధించిన పలు అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు