Saturday, May 11, 2024

మొక్కవోని సంకల్పంతో పోరాడి ప్రభుత్వం మెడలువంచుదాం…

తప్పక చదవండి
  • రైతు రాష్ట్ర నాయకుడు “విక్రమ్ రెడ్డి

హైదరాబాద్ : ప్రభుత్వ బెదిరింపులకు,కేసులకు ఇతర ఇబ్బందులకు నెరవకుండా గట్టిగా మొక్కవోని సంకల్పంతో పోరాడి ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించుకుందాం అంటూ రైతు రాష్ట్ర నాయకులు జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు.. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల స్విపర్లు క్రమబద్దీకరణ,పలు డిమాండ్ల పై చేస్తున్న రిలే దీక్షలు 50వరోజుకు చేరిన సంధర్భంగా దీక్ష శిబిరాన్ని పలువురితో కలిసి సందర్శించి సంగిభావం తెలిపి దీక్షలో కూర్చున్న వారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు దశాబ్దాలుగా వెట్టి చాకిరి చేపించుకుంటు చిన్న చూపు చూస్తూ ఇప్పటికి కూడా న్యాయబద్దమయిన చట్టబద్దమయిన డిమాండ్లపై ప్రభుత్వం నెలన్నరకు పైగా దీక్షలు చేస్తున్న స్పందించకపోవడం శోచనీయమన్నారు.. ఇప్పటికయినా తక్షేణం స్పందించి వ్రాతపూర్వక హామీ ఇచ్చి సమ్మె విరమింపచేసి దఫా ధఫాలుగా డిమాండ్లను పరిష్కరించడానికి వెనువెంటనే ముందుకు రావాలని కోరారు లేని పక్షంలో తాము ముందుండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తం అని అప్పుడు ప్రభుత్వం బాద్యతవహిస్తూ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు తిరుపతి,గంగాధర్,బుచ్చిరెడ్డి లతో పాటు స్విపర్ల జిల్లా అధ్యక్షుడు అహ్మద్ తో పాటు జిల్లా లోని అన్నీమండలాలకు చెందిన పలువురు స్విపర్లు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు