Saturday, May 18, 2024

కేటీఆర్‌ షాడో సీఎంగా అధికారం చెలాయింపు

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లను ఓడిరచాల్సిందే
  • ఈ రెండు పార్టీలతో తెలంగాణకు నష్టం
  • సిరిసిల్ల ప్రచారంలో బండి సంజయ్‌ పిలుపు

సిరిసిల్ల : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రచారాన్ని ఉధృతం చేశారు. వివిధ ప్రాంతాల్లో ఆయన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని, బిసి వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. సిరిసిల్లలో మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులు అవినీతిపరులని అంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మచ్చలేని బీసీ నాయకుడు సీఎం అవుతారు. కేటీఆర్‌… నిన్ను సీఎంగా ప్రకటించే దమ్ముందా విూ అయ్యకు. బీసీని సీఎం చేస్తామంటే గుణం ముఖ్యమని బీసీలను అవమానిస్తావా?. కేటీఆర్‌ షాడో సీఎం… సిరిసిల్లలో సామంత రాజుల పాలన సాగుతోందన్నారు. చినుకులు పడితే మునిగిపోయే సిరిసిల్ల. ఎంపీ ఎన్నికల్లో మాదిరిగా సిరిసిల్లలో సైలెంట్‌ ఓటింగ్‌ తథ్యం. రాణిరుద్రమ గెలుపు ఖాయం.’ అని బండి సంజయ్‌ అన్నారు. రాణిరుద్రమ నిఖార్సయిన తెలంగాణ బిడ్డ అన్నారు. ఆమెను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయులారా… సర్కార్లను మార్చేసిన చరిత్ర విూది అని… కేసీఆర్‌ అరాచక పాలనకు పాతరేయండి అని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ సభలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే వెంటనే కుప్పకూలు తాయన్నారు. తెలంగాణలో బీజేపీ తొలి గెలుపు సిర్పూర్‌ దే అని ధీమా వ్యక్తం చేశారు. కోనప్పా… ఇగ చాలప్పా… ఆంధ్రా వెళ్లిపో..’ అంటూ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కన్నప్పపై బీజేపీ నేత వ్యాఖ్యలు చేశారు. అంబలి, అన్నదానం చేస్తే చేసిన పాపాలు పోతాయా? అని ప్రశ్నించారు. సిర్పూర్‌ మిల్లులో ఉద్యోగాలియ్య కుండా స్థానికుల పొట్టకొడతావా అంటూ మండిపడ్డారు. చేసిన తప్పులకు రాజీనామా చేసి వెళ్లిపోక మళ్లీ ఓట్లడుగుతావా అని నిలదీశారు. 50 లక్షల నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన మూర్ఖుడు కేసీఆర్‌ అని విరుచుకుపడ్డారు. ఉద్యోగాల్లేక ఇంటికి బరువైన యువతను చూసి తల్లిదండ్రులు గుండెపగిలి రోదిస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, విద్యార్థుల, మహిళల పక్షాన యుద్ధం చేశానన్నారు. సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌లో గోండు ఖిల్లాను కబ్జా చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం నేతలు రెచ్చిపోతుంటే ఏం చేస్తున్నారని అడిగారు. పాతబస్తీలో సభ పెట్టి దమ్ము చూపిన.. సిర్పూర్‌లో మీ సత్తా చాటండని అంటూ బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు