Monday, May 6, 2024

టీ20 ప్రపంచకప్‌ 2024 నుంచి కోహ్లీ ఔట్‌..?

తప్పక చదవండి

క్రికెట్‌ అభిమానుల దృష్టి ప్రస్తుతం మరో ఆరు నెలల్లో జరగనున్న 2024 టీ20 ప్రపంచకప్‌ పై పడింది. వన్డే ప్రపంచకప్‌ 2023లో ఆఖరి మెట్టు పై బోల్తా పడిన టీమ్‌ఇండియా టీ20 ప్రపంచకప్‌ను ఎలాగైన కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆ మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసే పనిలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) నిమగ్నమైంది. ఇందుకోసం ఇటీవల ఢల్లీిలో సమావేశమైన బీసీసీఐ అధికారులు, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలక్షన్‌ కమిటీ చీఫ్‌ అజిత్‌ అగార్కర్‌లతో కలిసి పొట్టి ప్రపంచకప్‌ కోసం రోడ్‌ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక వన్డే ప్రపంచకప్‌ ముగిసిన తరువాత నుంచి అభిమానులను ఓ పశ్ర వెంటాడుతోంది. టీ20 ప్రపంచకప్‌లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ ఆడతాడా..? లేదా అనేది. వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌ 2022లో సెమీ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోయిన తరువాత ఈ ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా తరుపున కోహ్లీ మరో మ్యాచ్‌ ఆడలేదు. దైనిక్‌ జాగరణ్‌ నివేదిక మేరకు మిడిల్‌ ఆర్డర్‌లో కోహ్లీకి ప్రత్యామ్నాయ ఆటగాడిపై మేనేజ్‌మెంట్‌ దృష్టి సారించిందట. విరాట్‌ సాధారణంగా వన్‌ డౌన్‌లో ఆడుతాడు అనే విషయం తెలిసిందే. ఈ స్థానంలో కోహ్లీకి ప్రత్యామ్నాయంగా ఇషాన్‌ కిషన్‌ను ఆడిరచే అవకాశాలను కొట్టి పారేయలేమని ఓ బీసీసీఐ అధికారి దైనిక్‌ తో చెప్పినట్లు కథనం పేర్కొంది. ఆరంభం నుంచి ఇషాన్‌ కిషన్‌ ధాటిగా ఆడగలడని, లెఫ్ట్‌ హ్యాండర్‌ కావడంతో జట్టు కాంబినేషన్‌ సైతం అద్భుతంగా కుదిరే అవకాశం ఉందన్నాడు. విరాట్‌ కోహ్లీ ఐపీఎల్‌ 2024లో ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పాడు. అయితే.. అతడు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు తరుపున ఓపెనింగ్‌ స్థానంలో ఆడతాడు కాబట్టి అతడిని ఓపెనింగ్‌ స్థానంలో అయితే పరిగణలోకి తీసుకోలేమని చెప్పాడు. ఇప్పటికే చాలా మంది ఓపెనర్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఇక ఈ ఫార్మాట్‌లో ఏదైన నిర్ణయం తీసుకునే ముందు మాత్రం విరాట్‌ కోహ్లీతో తన భవిష్యత్తు గురించి సంప్రదించిన తరువాతనే ఉంటుందని చెప్పారు. చూడాలి మరీ బీసీసీఐ విరాట్‌ కోహ్లీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు