Wednesday, May 1, 2024

చేవెళ్ల సాక్షిగా కేసీఆర్ సింహ గర్జన..

తప్పక చదవండి
  • ఈనెల 13న చేవెళ్లలో పెద్ద ఎత్తున కేసీఆర్ బహిరంగ సభ..
  • చేవెళ్ల శిఖరంపై మూడోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం..
  • పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం..
  • చేవెళ్ల ప్రాంత సుస్థిర అభివృద్ధికి శ్రీకారం చుట్టిందే కేసీఆర్..
  • 111 జీవో రద్దు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం తుది దశ..
  • ఈ ఘనత సాధించింది బీఆర్ఎస్ సర్కారు..
  • సంక్షేమ పథకాలతో ప్రజలను కాపాడుకున్నారు కేసీఆర్..
  • 110 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కడగండ్లు తప్ప ఏమీలేదు..
  • కాంగ్రెస్ పార్టీ చేతకాని పాలనకు చెక్ పడాలి ప్రజలకు మేలు జరగాలి..
  • ఇది సాధ్యం కావాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలి..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో మేలు పొందిన లబ్ధిదారులందరూ ఈ నెల 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కేసీఆర్ ను ఆశీర్వదించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు మహేశ్వరం ఎమ్మెల్యే , మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.. చేవెళ్ల బహిరంగ సభ కోసం స్థానిక ఫరా ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ ను ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, అరికెపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డితో కలిసి పరిశీలన చేశారు సబితా ఇంద్రారెడ్డి..

ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. మార్పు పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలను కష్టాలపాలు చేసిందని.. ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి కేసీఆర్ ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.. నీళ్లు ఇవ్వకుండా పంటలు ఎండ బెట్టి రైతుల ఉసురు తగిలి పాపం మూటగట్టుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.. చేవెళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ సభను ప్రజలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించుకుందాం సత్తా చాటుదాం అన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలకు ప్రజలు కోరుకున్న మార్పును తేలేక.. పాలనను గాలికివదిలేసి కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె విమర్శించారు.. పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో సంతోషంగా ఉన్న రాష్ట్ర ప్రజలు 110 రోజుల కాంగ్రెస్ కష్టాల, కన్నీళ్ల పాలన మాకొద్దని.. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి గా రావాలని కోరుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనకు ఆదిలోనే ముకుతాడు వేసేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థి కాసాని గెలుపు కోసం చేవెళ్లలో బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రజలకు సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం కరెంట్ ఏవిధంగా ఇస్తుందో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి రైతన్నకు తెలుసునని చెప్పారు. వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య వస్తుందని, మేనేజ్ చేయడం రాక ప్రభుత్వంలో ఉన్నవాళ్లు పాలనను గాలికి వదిలేసి, కేసిఆర్ గురించి మాట్లాడడం తప్ప పాలన సక్రమంగా చేరడం లేదని మండిపడ్డారు. గత మూడు రోజుల క్రితం రైతుల కష్టాలు తెలుసుకోవడానికి ఎండిన పంటను పరిశీలించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ పర్యటనకు వెళ్లడంతో.. రెండు రోజుల క్రితం సాగునీళ్లు వదిలారని అన్నారు. సాగునీరు ఉన్నా విడుదల చేయకుండా.. రైతులకోసం కేసీఆర్ ఒక సిస్టం ఏర్పరచినా.. ఆయనను బద్నాం చేయడానికి ప్రజలను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో బయటపడిపోయిందన్నారు. నీళ్లు ఉండి కూడా ఇవ్వకుండా పంటలు ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవమున్న కాసాని జ్ఞానేశ్వర్ ను ఎంపీగా గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. చేవెళ్లలో 13వ తేదీన జరిగే కేసిఆర్ సభకు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సూచించారు.

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ… చేవెళ్లలో జరిగే కేసిఆర్ బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరు కలిసికట్టుగా సభను విజయవంతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. చేవెళ్ల ప్రజలు తనను ఎంపీగా ఆశీర్వదిస్తే పార్లమెంటులో తెలంగాణ గొంతుక వినిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, చేవెళ్ల మాజీ ఎంపీపీ మంగలి బాలరాజ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్, పార్టీ నాయకులు యాదగిరి, చంద్రారెడ్డి, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు