Tuesday, May 14, 2024

జ్యూవెల‌రీ స్టోర్ ఈమెయిల్ ఐడీ చోరీ..

తప్పక చదవండి
  • 18 ల‌క్ష‌ల రూపాయలు కొట్టేసిన స్కామ‌ర్లు..

న్యూ ఢిల్లీ : దేశ‌వ్యాప్తంగా గ‌త కొద్దినెల‌లుగా ఆన్‌లైన్ స్కామ్‌లు పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ముంబైలోని ఓ జ్యూవెల‌రీ స్టోర్ ఈమెయిల్ ఐడీని చోరీ చేసిన స్కామ‌ర్లు కంపెనీ ఖాతా నుంచి రూ. 18 ల‌క్ష‌ల‌ను ద‌ర్జాగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ముంబై సిటీ కోఆప‌రేటివ్ బ్యాంక్‌ను బోల్తా కొట్టించిన బిహార్‌, యూపీకి చెందిన ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యూవెలరీ స్టోర్ య‌జ‌మానిగా ప‌రిచ‌యం చేసుకున్న నిందితుడు స్టోర్ ఖాతా నుంచి రూ. 18 ల‌క్ష‌ల‌ను రెండు ఇత‌ర ఖాతాల‌కు మ‌ళ్లించాల‌ని బ్యాంక్ అధికారుల‌ను కోరాడు. జ్యూవెల‌రీ షాప్ ఖాతా ఉన్న బ్యాంకుకు ఈమెయిల్ ఐడీ ద్వారా స్కామ‌ర్లు బ్యాంక్ మేనేజ‌ర్‌ను సంప్ర‌దించి, రెండు వేర్వేరు ఖాతాల‌కు రూ 18 ల‌క్ష‌లు బ‌దిలీ చేయాల‌ని నిందితులు కోరారు. ఇది స‌రైన ఈమెయిల్ అని భావించిన మేనేజ‌ర్ ఈమెయిల్‌లో చిన్న మార్పుల‌ను గుర్తించ‌కుండా వారు చెప్పిన‌ట్టే న‌గ‌దు బ‌దిలీ చేశాడు. అయితే షాప్ య‌జమాని బ్యాంకును సంప్ర‌దించి అన‌ధికార లావాదేవీ గురించి ఆరా తీయగా నిందితులు త‌మను మోసం చేశార‌ని మేనేజ‌ర్ గ్ర‌హించాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నిందితులపై సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. నిందితుల‌ను బిహార్‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్ యోగేష్ శ‌ర్మ‌, సెక్యూరిటీ గార్డ్ ఆద‌ర్శ్ సింగ్‌, యూపీకి చెందిన కార్మికుడు ఉమేష్ గుప్తాలగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు