Tuesday, May 21, 2024

జేఈఈ మెయిన్‌ దరఖాస్తులు ప్రారంభం..

తప్పక చదవండి
  • జనవరిలో 24 నుంచి ఎగ్జామ్స్‌

న్యూఢిల్లీ : దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్‌ సంస్థల్లో ప్రవేశాలకోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం (నవంబర్‌ 1న)తో ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు నవంబర్‌ 30న రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఈ పరీక్షలను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి సెషన్‌, ఏప్రిల్‌లో రెండో విడత పరీక్షలు జరుగనున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు ఉంటాయి. ఈ మేరకు జనవరి సెషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. బీఈ , బీటెక్‌ కోర్సుల కోసం పేపర్‌-1, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల కోసం పేపర్‌-2 నిర్వహిస్తారు. దరఖాస్తులు బుధవారం ప్రారంభమయ్యాయి. నవంబర్‌ 30న అప్లికేషన్లు ముగుస్తాయి. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహిస్తారు. ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేస్తారు.

ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబర్‌ 1
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్‌ 30
ఫీజు చెల్లింపునకు చివరితేదీ: నవంబర్‌ 30 (రాత్రి 11.50 గంటల వరకు)
పరీక్ష కేంద్రాల (నగరాలు) ప్రకటన: 2024, జనవరి రెండో వారంలో
అడ్మిట్‌కార్డులు: పరీక్ష తేదీకి 3 రోజుల ముందు
ఆన్‌లైన్‌ పరీక్షలు: 2024, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు
పరీక్ష ఫలితాలు: 2024, ఫిబ్రవరి 12
వెబ్‌సైట్‌: www.nta.ac.in, https://jeemain.nta.ac.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు