Sunday, May 12, 2024

డమ్మీలతో దందా జరుగుతున్నాకమిషనర్‌ చర్యలెక్కడ..?

తప్పక చదవండి

కాంట్రాక్టు బేసిస్‌ మీద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారు కొందరు ఎస్‌.ఎఫ్‌.ఏ. లు.. కాగా ఈ ఎస్‌.ఎఫ్‌.ఏ. లు తమ కుటుంబీకుల పేర్లను రిజిస్టర్‌లో చూపిస్తూ వారు విధులకు హాజరు కాకుండానే జీతం డబ్బులు దొబ్బేస్తున్నారు.. తద్వారా నిజంగా అవసరమున్న వారికి పని లేకుండా పోతోంది.. ఈ విధంగా కొందరు ఉన్నతాధికారుల కనుసన్నలలోనే కొందరు ఎస్‌.ఎఫ్‌.ఏ. లు డమ్మీ కార్మికుల పేరుతో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు.. ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు జీ.హెచ్‌.ఎం.సి. సర్కిల్‌ – 17లో వెలుగు చూసింది. ఆ వివరాలు ఆధారాలతో ఆదాబ్‌ వెలుగులోకి తెచ్చింది.. ఇంత జరుగుతున్నా జీ.హెచ్‌.ఎం.సి. కమిషనర్‌ ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయం.. దీంతో ఏ.ఎం.హెచ్‌.ఓ. కనుసన్నలలో ఎస్‌.ఎఫ్‌.ఏ. లు రెచ్చిపోతూ తమ అవినీతి దందాను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు..

  • జీ.హెచ్‌.ఎం.సి. సర్కిల్‌ 17లో యథేచ్ఛగా అక్రమ వ్యవహారంపై ఆదాబ్‌ కథనం..
  • ఏ.ఎం.ఓ.హెచ్‌. భార్గవ నారాయణ కనుసన్నలలోనే వ్యవహారం..
  • ఒక్కో ఎస్‌.ఎఫ్‌.ఏ. నుండి నెలకు రూ. 6000 వసూలు చేస్తున్నట్టు వార్తలు..
  • డ్యూటీలో లేని ఉద్యోగుల పేర్లు రిజిస్టర్‌లో ఉంటాయి..
  • తమ కుటుంబ సభ్యుల పేర్లు రిజిస్టర్‌లో నమోదు చేసి జీతం కొట్టేస్తున్న ఎస్‌.ఎఫ్‌.ఏ.లు
  • డిప్యుటేషన్‌ పై జీ.హెచ్‌.ఎం.సి.కి వచ్చి అవినీతి చక్రం తిప్పుతున్న ఏ.ఎం.హెచ్‌.ఓ.
    హైదరాబాద్‌ : జీ.హెచ్‌.ఎం.సి. సర్కిల్‌ – 17లో ఏ.ఎం.ఓ.హెచ్‌. గా భార్గవ నారాయణ విధులు నిర్వహిస్తున్నారు.. కాగా ఈ సర్కిల్‌ లో సుమారు 41 మంది ఎస్‌.ఎఫ్‌.ఏ. లు పనిచేస్తున్నారు.. ఒక్కో ఎస్‌.ఎఫ్‌.ఏ. కింద దాదాపు మూడు గ్రూపులు ఉంటాయి.. ఇక ఒక్కో గ్రూపులో 7 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తూ ఉంటారు.. మొత్తానికి 846 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.. అయితే కొంతమంది ఎస్‌.ఎఫ్‌.ఏ. లు తమ కుటుంబ సభ్యుల పేర్లు పారిశుధ్య కార్మికుల లిస్ట్‌ లో చేర్చి, వారు విధులకు హాజరు కాకుండానే వారి పేరుమీద నెల నెలా జీతాలు డ్రా చేస్తున్నట్లు తెలియవచ్చింది.. అత్యంత నీచంగా బ్రతుకుదెరువు కోసం.. అనునిత్యం కాలుష్యంతో సావాసం చేస్తూ విధులు నిర్వహిస్తున్న నిరుపేద కార్మికుల సొమ్మును కాజేస్తున్న ఏ.ఎం.హెచ్‌.ఓ. భార్గవ నారాయణ, సంబంధిత ఎస్‌.ఎఫ్‌.ఏ.లు క్షమార్హులు కాదంటు న్నారు సామాజిక వేత్తలు.. కాగా ఈ అవినీతి భాగోతం సర్కిల్‌ – 17, ఖైరతాబాద్‌ జోన్‌ లో ఏ.ఎం.ఓ.హెచ్‌.గా విధులు నిర్వహి స్తున్న భార్గవ నారాయణ కనుసన్నలలోనే జరుగుతున్నట్లు తెలియవచ్చింది.. హెల్త్‌ డిపార్ట్మెంట్‌.. నుండి డిప్యుటేషన్‌ మీద జీ.హెచ్‌.ఎం.సి. కి వచ్చిన ఈయన గత 6 సంవత్సరాల నుండి ఇక్కడే తిష్ట వేసి అవినీతి వ్యవహారాన్ని నిరాటంకంగా కొనసాగి స్తున్నాడు.. జీ.హెచ్‌.ఎం.సి.లో వచ్చే అక్రమార్జన కోసం కక్కుర్తి పడుతూ తన సొంత డిపార్ట్మెంట్‌ కు వెళ్ళడానికి ఆయన ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.. కాగా ఇతగాడు ఒక్కో ఎస్‌.ఎఫ్‌.ఏ. నుండి సుమారు నెలకు రూ. 6000 వసూలు చేస్తాడని తెలు స్తోంది.. దీనిని అలుసుగా తీసుకున్న ఎస్‌.ఎఫ్‌.ఏ.లు బరితెగించి డమ్మీ కార్మికుల పేరుతో జీతాలు తీసుకుంతున్నారన్నది పచ్చి నిజం.. ఉన్నతాధికారులు కలుగజేసుకుని ఈ వ్యవహారానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని.. డమ్మీల స్థానంలో అర్హులైన వారిని నియమించి వారికి ఉపాధి కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.. తక్షణమే ఏ.ఎం.హెచ్‌.ఓ. భర్గవ నారాయణ మీద చర్యలు తీసుకోవాలని వారు కోరు తున్నారు.. కాగా గతంలో లో కూడా సదరు భార్గవ నారాయణ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. జీ.హెచ్‌.ఎం.సి. సర్కిల్‌ – 17, ఖైరతాబాద్‌ డివిజన్‌ లో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను వాస్తవాలతో వెలుగులోకి తీసుకుని వచ్చిన ‘ ఆదాబ్‌ ‘ కథనాలపై ఇప్పటికైనా కమిషనర్‌ సీరియస్‌ గా స్పందించి ఈ అవినీతి వ్యవహారానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని వారు కోరుతున్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు