Sunday, May 5, 2024

తబ్లిగి జమాత్‌కు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ

తప్పక చదవండి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తబ్లిగి జమాత్‌కు నిధులు కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్‌ బోర్డు నిధులతో ప్రభుత్వానికి సంబంధం లేదనేది పిటిషనర్‌ వాదన. నిధులు విడుదల చేయాలని వక్ఫ్‌ బోర్డును ఆదేశించే హక్కు ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిధులు కేటాయిస్తూ చేస్తూ జారీ చేసిన జీఓను రద్దు చేయాలని కోరుతున్నారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులు మైనారిటీ వెల్ఫేర్‌ కోసమేనని ప్రభుత్వం వాదిస్తోంది. తబ్లిగి జమాత్‌ను రష్యాతో పాటు మరి కొన్ని దేశాలు బ్యాన్‌ చేశాయని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రష్యా వాళ్ళు భగవద్గీతను కూడా బ్యాన్‌ చేశారు కానీ మనం అనుసరిస్తున్నాం కదా అని హైకోర్టు ప్రశ్నించింది. 2020లో భైంసాలో ఇలానే సభ పెడితే ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది పేర్కొన్నారు. డిసెంబర్‌ 13న రూ.2.45 కోట్లు నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం జరిగింది. అయితే పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు