- ఈ సంఘటన దేశానికి సిగ్గుచేటు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మణిపుర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు.
అనంతరం పార్లమెంట్ సమావేశాల గురించి మాట్లాడుతూ.. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ్యులంతా సహకరించాలన్నారు. ‘‘అన్ని అంశాలపై పార్లమెంట్‌లో చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన సమయం దొరుకుతుంది. ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సమావేశాల్లో ప్రజలకు ఉపయోగపడే పలు బిల్లులు తెస్తున్నాం. ముఖ్యమైన బిల్లులపై చర్చించేందుకు ఈ సమయం వినియోగించుకోవాలి’’ అని మోదీ విపక్షాలకు పిలుపునిచ్చారు.