Thursday, May 16, 2024

బిర్యానీ సెంటర్లకు పెరిగిన ఆర్డర్లు

తప్పక చదవండి
  • కార్యకర్తల కోసం నేతల వెచ్చింపు

హైదరాబాద్‌ : ఎన్నికలంటే.. ప్రచారం.. ప్రసంగాలే కాదు.. రుచికరమైన వంటకాలతో అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేయాల్సిందే. పార్టీ నేతలు.. కార్యకర్తలు.. ప్రచారానికి వెంట నడిచే మహిళలు, పురుషులకు నోరూరించే రుచికరమైన విందు ఉండకపోతే వారంతా వెనక్కి పోతారు. ఫలితంగా ప్రస్తుతం హైదరాబాద్‌ బిర్యానీకి విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. ఎన్నికల సీజన్‌లో నేతల వెంట తిరిగే అభిమానులు, కార్యకర్తలు బిర్యానీ లేకపోతే ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. ముందురోజు పిలుపు వచ్చిన వెంటనే బిర్యానీ ఉండాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు జయాపజయాలు ఎలా ఉన్నా మందు, బిర్యానీ పెట్టడం అభ్యర్థులకు సవాల్‌గా మారింది. అందుకే అడిగిన వెంటనే కాదనలేక పోతున్నారు. ఓట్ల పండగ పుణ్యమాంటూ వంటమేస్త్రీలకు గిరాకీ ఏర్పడిరది. ఉదయం, సాయంత్రం సుమారు 200300 మందికి వంట చేసే అవకాశం దక్కిందంటున్నారు. హైదరాబాద్‌లో పలు బిర్యానీ సెంటర్లకు కూడా గిరాకీ పెరుగుతోంది. ఆర్డర్లను బట్టి బిర్యానీలు అందిస్తున్నారు. హోటల్‌లో ప్రతిరోజూ 30004000 వరకూ అదనంగా చికెన్‌ బిర్యానీ ప్యాకెట్లు విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అధికంగా ఓటర్లు శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, మల్కాజిగిరి, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ వంటి నియోజకవర్గాలు, నగరంలోని కీలకమైన జూబ్లీహిల్స్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌ పరిధిలో ఫంక్షన్‌ హాళ్లు, అపార్ట్‌మెంట్స్‌ సెల్లార్లను అద్దెకు తీసుకొని వంటశాలలుగా మార్చుతున్నారు. ఈనెల 13 నుంచి కార్తికమాసం ప్రారంభంతో శాకాహార వంటకాలు కూడా చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం పలువురు వ్యక్తంచేశారు. బిర్యానీ లేకపోతే ప్రచారానికి డుమ్మా కొడుతున్నారంటూ గల్లీ లీడర్లు వాపోతున్నారు. వీళ్లను ఒప్పించి నాయకుడి వెంట నడిపించేందుకు రోజూ ప్యాకెట్లు కొనటమో, వంటకాలు చేయించటమో చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు