Monday, April 29, 2024

తోలు కట్ట గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్‌

తప్పక చదవండి
  • వెంచర్‌ రూపకల్పనలో గ్రామ సర్పంచ్‌ కనకమామిడి శ్రీనివాస్‌ కీలకం..
  • అధికార దర్పంతో ప్రభుత్వ భూమిలో అనుమతులు..
  • సర్వే నెంబర్‌ 135లో 5 ఎకరాలు మాయం చేసే కుట్ర..
  • ఈ భూమి 111 జీఓ పరిధిలోకి వస్తుండటం గమనార్హం..
  • సర్పంచ్‌ సహకారంతో అక్రమ వెంచర్‌ చేస్తున్న జీ.ఎం.ఎస్‌. సంస్థ
    గ్రామ స్థాయిలో ప్రధమ పౌరుడు సర్పంచ్‌.. భారత రాజ్యాంగం సర్పంచ్‌ లకు విశిష్ట అధికారాలు కల్పించింది.. గ్రామాల పటిష్ఠం కోసం సర్పంచ్‌ తన శాయశక్తులా కృషి చేయాల్సి ఉంటుంది.. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిల్లో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే సర్పంచుల పాత్ర ఎంతగానో ఉంటుంది.. అలాంటి సర్పంచ్‌ లే అక్రమాలకు పాల్పడితే.. దేశ భవిష్యత్‌ నిలువునా కూలిపోతుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్‌ మండలం, తోలు కట్ట గ్రామంలో నెలకొంది.. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఆ గ్రామ సర్పంచ్‌ అప్పనంగా ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ధారాదత్తం చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఆ కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..

గ్రామ స్థాయిలో ప్రధమ పౌరుడు సర్పంచ్‌.. భారత రాజ్యాంగం సర్పంచ్‌ లకు విశిష్ట అధికారాలు కల్పించింది.. గ్రామాల పటిష్ఠం కోసం సర్పంచ్‌ తన శాయశక్తులా కృషి చేయాల్సి ఉంటుంది.. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిల్లో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే సర్పంచుల పాత్ర ఎంతగానో ఉంటుంది.. అలాంటి సర్పంచ్‌ లే అక్రమాలకు పాల్పడితే.. దేశ భవిష్యత్‌ నిలువునా కూలిపోతుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్‌ మండలం, తోలు కట్ట గ్రామంలో నెలకొంది.. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఆ గ్రామ సర్పంచ్‌ అప్పనంగా ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ధారాదత్తం చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఆ కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం.. గ్రామ స్థాయిలో ప్రధమ పౌరుడు సర్పంచ్‌.. భారత రాజ్యాంగం సర్పంచ్‌ లకు విశిష్ట అధికారాలు కల్పించింది.. గ్రామాల పటిష్ఠం కోసం సర్పంచ్‌ తన శాయశక్తులా కృషి చేయాల్సి ఉంటుంది.. జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిల్లో ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలంటే సర్పంచుల పాత్ర ఎంతగానో ఉంటుంది.. అలాంటి సర్పంచ్‌ లే అక్రమాలకు పాల్పడితే.. దేశ భవిష్యత్‌ నిలువునా కూలిపోతుంది.. అలాంటి పరిస్థితే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్‌ మండలం, తోలు కట్ట గ్రామంలో నెలకొంది.. ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఆ గ్రామ సర్పంచ్‌ అప్పనంగా ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ధారాదత్తం చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఆ కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్‌ : గ్రామ స్థాయిలో ప్రభుత్వ భూములను రక్షించాల్సిన గురుతర బాధ్యత కలిగిన ఓ సర్పంచ్‌ దుర్మార్గంగా ప్రభుత్వ భూమిని ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం, మొయినాబాద్‌ మండలం, తోలు కట్ట గ్రామ పరిధిలో సర్వే నెంబర్‌ : 135లో సుమారుగా 5 ఎకరాల ప్రభుత్వ భూమి (లావణి పట్ట) ఉంది.. అయితే జీ.ఎం.ఎస్‌. అనే రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ వారికి ఈ భూమిపై కన్ను పడిరది.. ఆ భూమిని ఎలాగైనా కాజేయాలని కుట్రతో తోలు కట్ట గ్రామ సర్పంచ్‌ కనకమామిడి శ్రీనివాస్‌తో లావాదేవీలు జరిపింది.. ఇందులో భాగంగానే 2019లో సదరు సర్పంచ్‌ శ్రీనివాస్‌ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆ భూమిలో వెంచర్‌ వేసుకోవడానికి జీ.ఎం.ఎస్‌. సంస్థకు అక్రమంగా అనుమతులు ఇచ్చాడు..ఇంకేముంది ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తనపని తాను చేసుకుని పోతోంది.. అయితే ప్రభుత్వ భూమిలో వెంచర్‌ వేసుకోవడానికి సర్పంచ్‌ ఇంతకు తెగించి అనుమతులు ఎలా ఇచ్చాడన్నది అర్ధం కానీ విషయం.. పైగా తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తున్న గ్రామ సెక్రెటరీ తదితరులను బెదిరించి బలవంతంగా అనుమతులపై సంతకాలు చేయించినట్లు ఆరో పణలు ఊన్నాయి.. ఇంత జరుగుతున్నా ఉన్నతా ధికారులు గానీ, స్థానిక నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు గానీ మిన్నకుండి పోవడం అంత కంటే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఈ అక్రమ వ్యవహారం వారి దృష్టికి రాలేదా..? ఒక వేళ వచ్చినా చూసీ చూడనట్లు వ్యవహరిం చారా..? లేక జీ.ఎం.ఎస్‌. రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు అమ్ము డుపోయారా అన్నది ప్రశ్నార్థకమే.. వీరెవరూ స్పందించకుండా సదరు సర్పంచ్‌ కనకమామిడి శ్రీనివాస్‌ చక్రం తిప్పారా..? అన్నది తెలియాల్సి ఉంది.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇక ప్రభుత్వ భూములకు రక్షణ ఎక్కడ ఉంటుంది..? అని విశ్లేషకులు ప్రశ్నిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మరో విషయం ఏమిటంటే గతంలో కూడా ఇలాంటి అక్రమ వ్యవహారాలు జరిపినందుకు సర్పంచ్‌ కె. శ్రీనివాస్‌ ను జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేయడం జరిగింది.. అయితే కుక్కతోక వంకర అన్నట్లు తన వంకర బుద్ధి మార్చుకోకుండా సదరు సర్పంచ్‌ తిరిగి అదే త్రోవలో నడుస్తుండటం శోచనీయం..
ఈ వ్యవహారంపై కలెక్టర్‌ స్పందించి, సమగ్ర విచారణ జరిపించాలి.. దీనికి కారకులైన జీ.ఎం.ఎస్‌. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యాజమాన్యంపై, అక్రమ వ్యవహారంలో భాగస్వామి అయిన తోలు కట్ట సర్పంచ్‌ కనకమాడి శ్రీనివాస్‌ గ్రామ సర్పంచ్‌పై కఠిన చర్యలు చేపట్టి, అతని పదవినుంచి డిస్మిస్‌ చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు..
సర్వే నెంబర్‌ 108లో సుమారు రెవెన్యూ రికార్డ్‌ ప్రకారం 15 ఎకరాల భూమిలో ప్రైవేట్‌ వ్యక్తులతో కంటైనర్‌ ఏర్పాటు చేసి, ప్రహారీ నిర్మించిన కబ్జా వ్యవహారంపై మరో కథనం.. మీముందుకు తీసుకురానుంది ఆదాబ్‌ హైదరాబాద్‌..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు