- కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీశాడు..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. కట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్యను బావిలో వేలాడదీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీముచ్‌లో ఆగస్ట్ 20న ఈ ఘటన జరిగింది. రాకేష్ కిర్ అనే వ్యక్తి తన భార్య ఉషను బావిలో వేలాడదీసి ఆ దృశ్యాలను రికార్డు చేశాడు. ఆపై వీడియోను భార్య బంధువులకు పంపడంతో వారు గ్రామస్తులను సంప్రదించి తమ కూతురును కాపాడాలని కోరారు. స్ధానికులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాకేష్‌ను అరెస్ట్ చేశారు. రూ. 5 లక్షల కట్నం కోసం నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
తప్పక చదవండి
-Advertisement-