Monday, May 6, 2024

చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టు..

తప్పక చదవండి

న్యూ ఢిల్లీ : ఆసియా కప్ 2023 టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ 10 వికెట్ల తేడాతో టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగి 10 రోజులు కూడా కాకముందే లంకపై టీమిండియా మరో టైటిల్ మ్యాచ్‌ని నెగ్గింది. చైనాలోని హంగ్‌జౌ వేదికగా జరుగుతున్న అసియా క్రీడల్లో లంకపై భారత మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకం గెలిచింది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఏషియన్ గేమ్స్ ఉమెన్స్ టీ20 2023 ఫైనల్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున స్మృతీ మంధాన 46 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులు.. టిటాస్ సాధు 3 వికెట్లు సాధించారు. ఇక అంతకముందు టాస్ గెలిచి తొలి బ్యాటింగ్ చేసిన భారత్.. 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఇలా 117 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన లంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేయగలిగింది. దీంతో లంకపై భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించి, గోల్డ్ మెడల్‌ని కైవసం చేసుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు